sentence_hin_Deva
stringlengths 21
531
| sentence_tel_Telu
stringlengths 14
658
|
---|---|
सोशल मीडिया पर रूसी उत्पादों का बहिष्कार करने के लिए व्यापक आह्वान किए गए, और अनधिकृत ढंग से कंप्यूटर संचित सूचना चुराने वाले व्यक्तियों ने रूसी वेबसाइटों को निशाना बनाया, खास तौर पर उन्हें जो रूसी सरकार द्वारा संचालित हैं। | రష్యా వస్తువుల బహిష్కరణకు పిలుపులు సామాజిక మాధ్యమ వేదికలలో వ్యాపించగా, హ్యాకర్లు రష్యన్ వెబ్సైట్ల మీద, ముఖ్యంగా రష్యా ప్రభుత్వం నిర్వహించే వాటి మీద దాడి చేసారు. |
उन्होंने मुंबई के दादर रेलवे स्टेशन पर फूल बेचना शुरू किया और अंत में वे शहर में दो फूल की दुकानों के मालिक बन गए। | అతడు ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో పూలు అమ్మడం మొదలుపెట్టి, చివరకు నగరంలో రెండు పూల దుకాణాలకు యజమాని కాగలిగాడు. |
जिहादी, मुजाहिदीन और फिदायीन एक समान अरबी शब्द हैं जो अंग्रेजी शब्दकोश में आ कर चुके हैं। | జిహాదీ, ముజాహిదీన్ మరియు ఫెదాయీన్ అనేవి ఇంగ్లీష్ పదకోశంలోకి ప్రవేశించిన ఒకేలాంటి అరబిక్ పదాలు. |
लोकतंत्र की तमन्ना रखने वाले और सर्वोच्च नेता, अली ख़ामेनेई, के शासन की खिलाफत करने वाले ईरानियों को दीर्घावधि कारावास दंड या मृत्युदंड देने का दोनों न्यायाधीशों का लंबा रिकॉर्ड है। | న్యాయమూర్తులు ఇద్దరికీ సర్వముఖ్య నాయకుడు, అలీ ఖమేనీ ఏలుబడికి వ్యతిరేకిస్తూ, స్వాతంత్ర్యం కాంక్షిస్తున్న ఇరాన్ దేశస్థులకు దీర్ఘకాలిక ఖైదు లేదా మరణ దండనలు విధించిన సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నారు. |
प्रथम और उसके बाद होने वाले प्रत्येक मन्वंतर से पहले आती है मन्वंतर-संध्या (जोड़ने वाला अंतराल), जिसमें से प्रत्येक की अवधि कृत-युग (सत-युग) के बराबर होती है। | తొలి మన్వంతరానికి ముందు మరియు ప్రతి మన్వంతరం తరువాత ఒక మన్వంతర సంధ్య (సంధి కాలం) ఉంటుంది, ప్రతి ఒకటి కృత యుగం (సత్య-యుగం) అంత నిడివితో. |
क्रोनस ने अपने पिता का साथ विश्वासघात किया था, इसलिए उसे डर था कि उसके अपने बच्चे भी उसके साथ ऐसा ही करेंगे, और इसलिए हर बार जब रिया बच्चे को जन्म देती थी, वह बच्चे को छीन कर खा जाता था। | క్రోనస్ అతడి తండ్రికి ద్రోహం చేసిన కారణంగా, అతడి సంతానం అదే పని చేస్తుందేమోనని భయపడి, రియా ప్రసవించిన ప్రతీసారి అతడు ఆ బిడ్డను లాక్కుని తినేసేవాడు. |
फ्रीडेम हार्डी के अनुसार, आरंभिक "दक्षिणी कृष्णवाद," के सबूत मिले हैं हालांकि कृष्णवाद परंपराओं को उत्तरी परंपराओं से जोड़े जाने का अधिक झुकाव रहा है। | ఫ్రీడ్హేల్మ్ హార్డీ ప్రకారం, కృష్ణ సంప్రదాయాలను ఉత్తర సాంప్రదాయాలకు ఆపాదించేందుకు మొగ్గు ఉన్నప్పటికీ, "దక్షిణ కృష్ణ తత్వానికి" మునుపటి సాక్ష్యం ఉంది. |
पुनर्मूल्यांकन के माध्यम से बुद्ध के जीवन की कहानियों को दर्शाने के बौद्ध रिवाज में बुद्ध की प्रतिमा के प्रतिष्ठापन का रिवाज शामिल है। | బుద్ధుడి జీవిత పురాణగాధ యొక్క పునరాభినయాలతో కూడిన మరో బౌద్ధ ఆచారం, ఒక బుద్ధుడి విగ్రహాన్నిప్రతిష్ఠించడం అనే ఆచారం. |
बौद्ध धर्म में ब्रह्म प्रमुख भगवान (देव) और स्वर्ग के राजा हैं। | బౌద్ధమతం లో బ్రహ్మ ఒక ప్రధాన దేవుడు [దేవ) మరియు దైవిక పరిపాలకుడు. |
कर्नाटक के पत्तदकल में स्थित 7वीं और 8वीं शताब्दी के मंदिर मिश्रित शैलियों के लिए जाने जाते हैं जिन्हें बाद में उत्तर और दक्षिणी शैलियों का मिश्रण माना गया जैसा कि ऐहोल में भी है जिसमें अभी भी गजपृष्ठाकार कक्ष जैसी व्यवस्था नजर आती है। | కర్ణాటకలోని, పట్టదకల్లో ఉన్న 7వ మరియు 8వ శతాబ్దపు ఆలయాల సముదాయం ఆ తరువాత ఉత్తరం, దక్షిణంగా భావించబడ్డ ఇరు రూపాలను సమ్మిళితం చేసింది, అలాగే ఐహోల్ లో ఉన్నది కూడా, ఇది ఇప్పటికీ వృత్తాకార చైత్య సభా మందిరం వంటి నిర్మాణములతో కూడి ఉంది. |
हालांकि, धर्मान्तरित गैर-अरबी मुसलमानों के बीच अरब लोगों का ऊँचा दर्जा तथा गैर-अरबी मुसलमानों पर भारी कर देने की बाध्यता नाराज़गी के कारण बने। | ఏదేమైనా, అరబ్బులు కాని ముస్లిం మతాంతరితులలో అరబ్బుల హెచ్చు హోదా మరియు వారిపై భారీ పన్నులు చెల్లించవలసిన నిర్బంధం ఆగ్రహం కలిగించాయి. |
लोपेज़ का दावा है कि वे भी बौद्ध शब्द का प्रयोग करते थे, हालांकि विद्वान रिचर्ड कोहेन दावा करते हैं कि इस शब्द का प्रयोग केवल बाहर के लोग बौद्ध-धर्मियों का वर्णन करने के लिए करते थे। | రిచర్డ్ కోహెన్ అనే నిపుణుడు బౌద్ధ అనే పదం బౌద్ధులను వర్ణించేందుకు కేవలం బయటివారు మాత్రమే ఉపయోగించేవారు అని ఖచ్చితంగా చెప్పినప్పటికీ, వారు కూడా ఆ పదాన్ని ఉపయోగించేవారని లోపేజ్ వక్కాణించాడు. |
उनके भारत, पाकिस्तान और यू.एस.ए. में हजारों अनुयायी थे, और समग्र भारत में उनके कई खलीफा भी थे। | ఆయనకి భారత్, పాకిస్తాన్, మరియు యుఎస్ఏ అంతటా వేలాదిమంది శిష్యులు ఉండేవారు మరియు భారతదేశమంతటా ఎందరో ఖలీఫాలు కూడా ఉండేవారు. |
वे दिखाते हैं कि भगवान के अस्तित्व को सिद्ध करने के लिए दिए जाने वाले तर्क, जैसे कि प्रकृति के चमत्कार या ब्रह्मांड की स्पष्ट नियमितता, सभी को चुनौती दी जा सकती है (कुछ विशेष रूप से घृणास्पद कीड़ों के अस्तित्व में क्या आश्चर्य है, और इस अवलोकन में क्या नियमितता है कि सभी ग्रह लगभग एक ही समक्षेत्र में घूमते हैं, एक ही समक्षेत्र असाधारण हो सकता था, लेकिन "लगभग एक ही समक्षेत्र " बहुत कम विश्वसनीय है)। | దేవుణ్ణి నిరూపించడానికి ముందుకొచ్చిన ప్రధాన వాదనలన్నీ అభ్యంతరాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవేనని ఆయన చూపిస్తారు (కొన్ని ప్రత్యేకమైన అసహ్యమైన కీటకాల ఉనికిలో ఏ విస్మయం ఉంది, గ్రహాలన్నీ దాదాపు ఒకే సమతలంలో తిరుగుతున్నాయన్న పరిశీలనలో ఏ క్రమత్వం ఉంది, ఒకే సమతలం అనేది అద్భుతమవవచ్చు కానీ ""దాదాపు ఒకే సమతలం"" అనేది అంతగా ఆమోదయోగ్యమైనదిగా లేదు). |
यम ((दक्षिण क्षेत्रों में रहने वाले अच्छे मृत्यु के देवता ) को मात देने के लिए उत्तरी क्षेत्र उनके रूप में मानो प्रतिद्वंद्विता में दृढ़संकल्प हो कर एक अन्य मृत्यु के देवता को सामने ले आया। | యముడి(దక్షిణ ప్రాంతాలలో నివసించే మృత్యు దేవత)ని మించాలని గట్టిగా నిర్ణయించుకుని, ఉత్తర ప్రాంతం అతడిలో మరో మృత్యుదేవతను మేల్కొలిపినట్లుగా కనిపించింది. |
प्रसिद्ध वैदिक विद्वान और शिक्षक (आचार्य) आदि शंकराचार्य ने तब एक विरोधाभास उत्पन्न किया, जिसे अन्य आध्यात्मिक विषयों और परंपराओं में भी स्वीकार किया गया, जब उन्होंने जोर देकर कहा कि क्योंकि ब्रह्म हमेशा मौजूद है, ब्रह्म-ज्ञान तत्काल है और इसके लिए किसी "क्रिया", अर्थात, मेहनत और प्रयास, की आवश्यकता नहीं है; महावाक्यों के बारे में सोचने और यौगिक समाधि को ज्ञान के मार्ग के रूप में स्वीकार करने सहित अद्वैत परंपरा भी विस्तृत प्रारंभिक अभ्यास की अनुशंसा करती है। | బ్రహ్మన్ నిత్యమైనది అయినందున బ్రహ్మజ్ఞానం తక్షణమైనది, దానికి ఏ 'చర్య', అనగా ఏ కృషి మరియు ప్రయత్నం అవసరం లేదు అని 8వ శతాబ్దపు ప్రముఖ వేద పండితుడు, గురువు (ఆచార్య) అయిన ఆది శంకరుడు నొక్కి చెప్పగా, అద్వైత విధానం అనేది మహావాక్యాల గురించి ఆలోచించడం, యోగసమాధిని జ్ఞానమార్గంగా పరిగ్రహించడం, ఇతర ఆధ్యాత్మిక పద్ధతులు, సంప్రదాయాలలో కూడా గుర్తించబడిన వైరుధ్యాన్ని ప్రదర్శించడంతో సహా విస్తృతమైన సన్నాహక అభ్యాసాన్ని కూడా నిర్దేశిస్తుంది. |
इस्लाम के आने से बौद्ध धर्म के मठवादी परंपरा को मिलने वाला शाही संरक्षण हट गया और लंबी दूरी के व्यापार में मुसलमानों द्वारा बौद्ध धर्म के पालन करने वालों को विस्थापित कर दिए जाने से संरक्षण के संबंधित स्रोत भी खत्म हो गए। | ఇస్లాం రాకతో బౌద్ధమత సన్యాస సంప్రదాయానికి రాచరిక పోషణ ఆగిపోయింది, సుదూర వాణిజ్యంలో బౌద్ధుల స్థానంలో ముస్లింలు రావడంతో సంబంధిత పోషక వనరులు తరిగిపోయాయి. |
तीसरे चरण में अतिरिक्त विचार पेश किए गए; जैसे कि प्रथाएं, पश्चाताप और ताओवादी मंदिरों में भेंट चढ़ाने को प्रोत्साहित किया जाता था क्योंकि इनसे कार्मिक बोझ कम किया जा सकता था। | మూడవ దశలో, అదనపు ఆలోచనలు ప్రవేశపెట్టబడ్డాయి, ఉదాహరణకు, కర్మల భారం నుండి ఉపశమనం కలిగించగలవని తావోయిస్ట్ ఆలయాలలో ఆచారాలు, ప్రాయశ్చితం మరియు సమర్పణలు వంటివి ప్రోత్సహించబడ్డాయి. |
अनंत ने कौन्डिन्या को वचन दिया था कि अगर उन्होंने 14-वर्ष का व्रत किया, तो वे अपने सभी पापों से मुक्त हो जाएंगे और उन्हें धन, बच्चे और खुशी प्राप्त होंगे। | కౌండిన్యుడు 14 ఏళ్ల ప్రతిజ్ఞ చేస్తే అతడు తన పాపాలన్నీటి నుండి విముక్తుడై ఐశ్వర్యం, సంతానం మరియు సుఖం పొందుతాడాని అనంతుడు అతనికి వాగ్దానం చేసాడు. |
कुछ समय के लिए भारतीय बौद्धों में महायान अल्पसंख्यक थे, लेकिन यह संख्या धीरे-धीरे बढ़ती गई, और जब सातवीं शताब्दी में ह्वेन त्सांग भारत पहुंचे, लगभग सभी भिक्षुओं में से आधे महायानवादी हो चुके थे। | భారతీయ బౌద్ధులలో మహాయాన కొంత సమయం వరకు అల్పసంఖ్యాక వర్గంగా ఉండిపోయింది, నెమ్మదిగా ఎదిగుతూ, 7వ శతాబ్ద సమయానికి భారతదేశంలో షువాంగ్జాంగ్ ఎదుర్కొన్న బిక్షువులలో దాదాపుగా సగం మంది మహాయనులే అయ్యారు. |
डच कप्तान जोरिस वैन स्पिलबेर्गेन 1602 में जब तट पर पहुंचे तो कैंडी के राजा ने उनसे मदद की गुहार लगाई। | డచ్ నాయకుడు జోరిస్ వాన్ స్పీల్బర్గిన్ 1602 లో చేరుకున్నపుడు, క్యాండీ రాజు అతని సహాయం కోసం విజ్ఞప్తి చేసుకున్నాడు. |
रिपोर्ट ने चयनित आम टिप्पणियों और संधि निकायों द्वारा की गई देश-विशिष्ट अनुशंसाओं का हवाला दिया एवं अपनी व्यक्तिगत राय को उचित ठहराने के लिए तथाकथित योग्यकर्ता जैसे विवादित और अमान्य सिद्धांतों का प्रचार किया। | అతడి వ్యక్తిగత అభిప్రాయాన్ని సమర్ధించడానికి, ఒప్పంద సంస్థలు చేసిన సాధారణ వ్యాఖ్యలలో , దేశ-నిర్దిష్ట సూచనలలో నుండి కూడా అనుకూలమైనవి ఎంచుకొని ఉటంకించి, యోగ్యకర్త నియమాలు అనబడే వాటితో సహా వివాదాస్పదమైన మరియు గుర్తించబడని నియమాలను ఆ నివేదిక ప్రచారం చేసింది. |
एक व्यापक उदारवादी लोकतांत्रिक ढांचे के साथ कन्फ्यूशी रीति-रिवाजों और समाजों को जोड़ने वाला यह संश्लेषण पश्चिमी शैली के उदारवाद, जो कि त्सेंग की नज़र में अतिशय व्यक्तिवाद और नैतिक दृष्टि के अभाव से ग्रस्त है, और पारंपरिक कन्फ्यूशीवाद, जो त्सेंग की राय में ऐतिहासिक दृष्टि से सख्त अनुक्रम तथा दृढ़ीकृत अभिजात वर्ग से ग्रस्त है, दोनों ही से अलग है। | కన్ఫ్యూషియన్ ఆచారాలు మరియు విస్తృత ఉదారవాద ప్రజాస్వామ్య చట్రం కలిగిన సంస్థల ఈ సంయోజనం అనేది సెంగ్ అభిప్రాయం ప్రకారం, మితిమీరిన వ్యక్తివాదం మరియు నైతిక దృష్టి లోపానికి గురైన పాశ్చాత్య శైలి ఉదారవాదం, అలాగే ధృడమైన వర్గశ్రేణి మరియు కరుడుకట్టిన ఉన్నతశ్రేణుల వల్ల ప్రభావితమైన సంప్రదాయ కన్ఫ్యూషియనిజం, రెండిటికీ భిన్నమైనది. |
सिख धर्म मिताहार और खाने में संयम बनाए रखने को प्रोत्साहित करता है, यानी न तो भूखे रहें और न ही अत्यधिक खाएं। | సిక్కు మతం స్వయం నియంత్రణ మరియు మితాహారాన్ని ప్రోత్సాహిస్తుంది, అనగా పస్తులుండరాదు, అతిగానూ తినరాదు. |
कुछ भजन शताब्दियों पुराने थे, जो सभी क्षेत्रों में लोकप्रिय थे और समुदायों की परंपराओं के रूप में विरासत में सौंपे गए जबकि कुछ की रचना हाल ही में की गई थी। | కొన్ని భజనలు శతాబ్దాల నాటివి, అన్ని ప్రాంతాలలో ప్రసిద్ధికెక్కినవి, మరియు సంఘ పరంపరాగతంగా అందిపుచ్చుకున్నవి కాగా, మిగిలినవి కొత్తగా రచించబడినవి. |
और यदि कुछ लोग असंयमी (थे), तो जितना उनसे हो सकता था उन्होंने उतना असंयम त्याग दिया था; तथा भूत और भविष्य के भी विपरीत, अपने पिता और माता और बड़ों के प्रति आज्ञाकारी हो कर, प्रत्येक अवसर पर इसी तरह के व्यवहार के साथ वे ज़्यादा खुश रहते हुए बेहतर जीवन बिताएंगे। | ఎవరైనా విచ్చలవిడిగా (ఉండి) ఉంటే, గతానికి అలాగే భవిష్యత్తుకు విరుద్ధంగా తమ శక్తి కొద్దీ వారు తమ విచ్చలవిడితనాన్ని మానుకొని, వారి తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల విధేయత కలిగి ఉంటారు, ప్రతీ సందర్భంలో అలా ప్రవర్తించడం ద్వారా వారు మెరుగ్గా, మరింత సంతోషంగా జీవిస్తారు. |
गुरु ग्रंथ साहिब का आरंभ जपुजी साहिब से होता है जबकि दशम साहिब का आरंभ जाप साहिब से होता है जिसे जापुजी साहिब भी कहते हैं। | గురు గ్రంథ్ సాహిబ్ జప్జీ సాహిబ్ తో ఆరంభమవగా, దశం గ్రంథ్ జపు సాహిబ్ అని కూడా పిలవబడే జాప్ సాహిబ్ తో ఆరంభమవుతుంది. |
कॉन्स्टाना मुफ्ती, जो समुदाय के मुख्य प्रतिनिधि हैं, इमामों में से गुप्त मतदान के द्वारा चुने जाते हैं। | ఆ వర్గానికి ప్రధాన ప్రతినిధి అయిన కోంస్టానా ముఫ్తీ, రహస్య ఓట్ల ద్వారా ఇమామ్‌ల మధ్య నుండి ఎన్నుకోబడతాడు. |
कुछ जैन विद्वानों ने सर्वोच्च धार्मिक कर्तव्य के रूप में अहिंसा के धार्मिक आधार की व्याख्या की है कि जो “दान करने या अन्य प्राणियों के प्रति दया-भाव रखने की योग्यता से प्रेरित न हो, न ही सभी प्राणियों को बचाने के कर्तव्य से हो”, बल्कि "निरंतर आत्म-अनुशासन" के परिणामस्वरूप हो, जो कि आत्मा की शुद्धि है जो स्वयं के आध्यात्मिक विकास की ओर ले जाती है, जो अंततः व्यक्ति के उद्धार और पुनर्जन्म से मुक्ति को प्रभावित करती है। | అత్యున్నత మతపరమైన విధిగా అహింసకు వేదాంతపరమైన ఆధారం అనేది కొంతమంది జైన పండితులచే ఇలా అన్వయించబడింది, "మిగతా ప్రాణులకు ఇవ్వడం లేదా వారి పట్ల కరుణ చూపించడం లేదా అన్ని ప్రాణులను రక్షించే కర్తవ్యం నుండి వచ్చే పాత్రత కారణంగా స్ఫూర్తి పొందకూడదు," కేవలం "నిరంతర స్వీయ-క్రమశిక్షణ" నుండి తమ ఆధ్యాత్మిక పురోగతికి దారితీసే ఆత్మ శుద్ధి నుండి రావాలి, అది తుదకు వారి మోక్షాన్ని ప్రభావితం చేసి, పునర్జన్మల నుండి విడుదల చేస్తుంది. |
मुगल साम्राज्य के युग में कई खंडित सिख समूह बन गए। | ముఘల్ సామ్రాజ్య శకంలో ఎన్నో చీలిపోయిన సిక్కు సంఘాలు ఏర్పడ్డాయి. |
अलाई काल ने प्रारंभिक ममलुक शासन के पुराने राजघराने का तख्ता पलटते देखा। | అలై శకంలో మాంలుక్ పరిపాలన యొక్క తొలినాటి పురాతన ప్రభువుల తొలగింపు జరిగింది. |
अमृतसर में स्वर्ण मंदिर और हजूर साहिब उदाहरण हैं। | అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం మరియు హజూర్ సాహిబ్ ఉదాహరణలు. |
फेनेच कहते हैं, "भारतीय पौराणिक कथाओं का उल्लेख सिखों के पवित्र धर्मग्रंथ, गुरु ग्रंथ साहिब और द्वितीय धर्मग्रंथ, दशम ग्रंथ में भी किया गया है जो वर्तमान सिखों एवं उनके पूर्वजों के धार्मिक सांकेतिक जगत में नाज़ुक सूक्ष्मता और मूल्य जोड़ता है। | "సిక్కుల పవిత్ర నియమాల సంగ్రహం అయిన గురు గ్రంథ సాహిబ్ మరియు రెండోస్థాయి నియమాల సంగ్రహం అయిన దాసం గ్రంథాలలో భారతీయ పురాణగాధలు వ్యాపించి, నేటి సిక్కుల మరియు వారి పూర్వీకుల యొక్క పవిత్ర ప్రతీకాత్మక విశ్వానికి సున్నితమైన స్వల్పభేదాన్ని మరియు విషయాన్ని జోడిస్తాయి," అని ఫెనెక్ తెలియజేస్తారు. |
यह आख्यान सृजन संबंधी कथाओं के रूप में काम करते हैं जो बताते हैं कि इस शिक्षण संस्थान की स्थापना कैसे हुई और बुद्ध की सीख को संप्रेषित करने का इसे विशेष अधिकार क्यों है। | ఈ వ్యాఖ్యానాలు సృష్టి పురాణాలుగా పని చేస్తూ, ఈ ఆలోచనా విధానం ఎలా వచ్చింది మరియు బుద్ధుడి బోధనలను తెలియజేసేందుకు దానికి ప్రత్యేక ప్రామాణికత ఎందుకు ఉంది అనేది వివరిస్తాయి. |
मौलिक वर्गीकरण के विपरीत, कई श्रध्देय हिन्दू मूलग्रंथ और विचारधाराएं सामाजिक वर्गीकरण की इस प्रणाली पर सवाल उठाती हैं और इससे सहमत नहीं हैं। | ఈ పాఠాంతర వర్గీకరణకు విరుద్ధముగా, ఎన్నో పూజ్య హిందూ గ్రంథాలు మరియు సిద్ధాంతాలు ఈ సాంఘిక వర్గీకరణ వ్యవస్థతో విభేదించి ప్రశ్నించాయి. |
1925 में स्थापित फिनलैंड का इस्लामी संगठन सबसे पुराना है। | 1925 లో స్థాపించబడిన ఫిన్నిష్ ఇస్లామిక్ అసోసియేషన్ అన్నింటిలోకి అత్యంత పురాతనమైనది. |
मौराइडों की एक महिला मारबाउट हुई हैं, सोखना मैगट डायोप, जिन्होंने अपने पिता का पद विरासत में पाया था। | మౌరైడ్లకు, సోఖ్న మేగత్ డ్యోప్ అనే ఒక మహిళా మతబోధకురాలు ఉండేది, ఆమె తన తండ్రి యొక్క స్థానాన్ని వారసత్వంగా అందుకుంది. |
विशिष्ट तौर पर, शुरुआती आधुनिक स्पेन में ज़्यादातर मठवासिनियाँ ऐसे धनी परिवारों से हुआ करती थीं जो कॉन्वेंट के दहेज और वार्षिक शुल्क के रूप में "रखरखाव भत्ते" का खर्च वहन कर सकते थे। | సాధారణంగా, ఆధునిక స్పెయిన్ తొలినాళ్లలో, చాలా మంది నన్‌లు వార్షిక రుసుములు అయిన కాన్వెంట్ రుసుము, మరియు "నిర్వహణ భత్యాల" ను భరించగలిగే వనరులు కలిగిన సంపన్న కుటుంబాలకు చెందిన వారు. |
इनुइत लोगों की पारंपरिक कहानियाँ, रिवाज और वर्जनाएं अक्सर आर्कटिक के निष्ठुर वातावरण के कारण आने वाले खतरों के खिलाफ एहतियात होते हैं। | ఇనువిట్ కి చెందిన సాంప్రదాయక గాథలు, ఆచారాలు, మరియు నిషేధాలు తరచూ వారి ఉత్తరధ్రువప్రాంత కఠిన వాతావరణం కలిగించే ప్రమాదాలకు ముందు జాగ్రత్తలు. |
कपितायन में, वलीसोंगों ने "संगर" नाम का उपयोग पूजा या प्रार्थना के स्थानों के लिए भी किया है जो, हिंदू धर्म या बौद्ध धर्म में अर्का या मूर्तियों के विपरीत, कपितायन में सांग ह्यांग ताया के प्रतीक के रूप में इसकी दीवार में एक खाली सुराख के साथ एक चार-वर्गी भवन का प्रतिनिधित्व करता है। | ఆరాధన లేదా ప్రార్థన స్థలాల పరంగా, కపిటాయన్ లో, సంగర్ అనే పదాన్ని కూడా వాలిసోంగో ఉపయోగిస్తారు, ఇది హిందూ మతం లేదా బౌద్ధమతంలో మాదిరిగా గోపురాలు లేదా విగ్రహాలు కాకుండా కపిటాయన్ లోని సంగ్ హయాంగ్ తయాకు చిహ్నంగా దాని గోడలో ఒక ఖాళీ రంధ్రం గల నాలుగు మూలల చతురస్ర భవనాన్ని సూచిస్తుంది. |
ईसाइयों की नज़र में व्यभिचार अनैतिक है और इसे एक पाप माना जाता है, जो विचार मुख्य रूप से निर्गमन 20:14 और 1 कुरिन्थियों 6:910 जैसे अनुच्छेदों पर आधारित है। | క్రైస్తవమతం,ముఖ్యంగా ఎక్సోడస్ 20:14 మరియు 1 కొరింతియన్స్ 6:910 ప్రకారం వ్యభిచారాన్ని అనైతికం మరియు పాపాత్మకంగా చూస్తుంది. |
गैर-धार्मिक माता-पिता की परवरिश में पली अपनी माँ के बारे में वे कहते हैं कि वे "धर्म के प्रति अनासक्त" थीं, तब भी कई अर्थों में, "मेरी जानकारी में आध्यात्मिक रूप से सबसे अधिक जागृत व्यक्ति" और "धर्मनिरपेक्ष मानवतावाद की एकाकी साक्षी" थीं। | లౌకికవాద తలిదండ్రుల పెంపకంలో ఎదిగిన తన తల్లిని అతను,"మతానికి అతీతమని", అయిననూ, తాను యెరిగిన, ఎన్నో విధాలా అత్యంత "ఆధ్యాత్మిక స్పృహ గల వ్యక్తి", మరియు "లౌకిక మానవతావాదానికి ఏకైక సాక్షిగా" అభివర్ణించాడు. |
सनतकुमार उपनिषद खंड 7.1 में घोषित करते हैं कि , "सांसारिक ज्ञान को प्रेम दो और उसका सम्मान करो, लेकिन ब्रह्म के रूप में उस पूरे ज्ञान का ध्यान करो।" | ప్రాపంచిక జ్ఞానాన్ని పూజించి గౌరవించాలి, కాని ఆ సమస్త జ్ఞానాన్ని బ్రహ్మన్ పేరున ధ్యానం చేయాలి అని ఉపనిషత్తులోని 7.1 విభాగంలో సనత్ కుమార వక్కాణిస్తారు. |
ये मंत्र तैत्तिरीय उपनिषद्, शिक्षावल्ली I.11.2 से लिए गए हैं जिनमें कहा गया है: मातृदेवो भव, मित्रदेवो भव, पितृदेवो भव, पुत्रदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। | ఈ మంత్రాలు తైత్తిరీయోపనిషత్తు,ఒకటవ శిక్షావల్లి 11.2 లోనివి,ఇది: మాతృదేవో భవ, మిత్రదేవో భవ, పితృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని చెబుతోంది. |
1920 के ओलंपिक खेलों में भारत ने पहली बार राष्ट्रीय दल भेजा था और तब से हर ग्रीष्मकालीन ओलंपिक खेल में इसने भाग लिया है। | 1920 లో భారత్ తొలి జాతీయ జట్టుని ఒలింపిక్స్ కి పంపింది, ఇక అప్పటి నుండి ప్రతీ వేసవి ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటూ ఉంది. |
हवाई बंदूकें लंबी बंदूक (हवाई राइफल) और दस्ती बंदूक (हवाई पिस्तौल), दोनों रूपों में आती हैं। | గాలి తుపాకీలు అనేవి పొడవాటి తుపాకీ (గాలి రైఫిల్) మరియు చేతి తుపాకీ (గాలి పిస్టల్) అనే రెండు రూపాలలో వస్తాయి. |
मिल्खा सिंह एकमात्र धावक थे जिन्होंने राष्ट्रमंडल खेलों में एकल स्वर्ण पदक जीता था लेकिन 2010 के राष्ट्रमंडल खेलों में कृष्णा पूनिया ने इतिहास रचा जब महिलाओं की चक्का फेंक प्रतियोगिता में उन्होंने भारत के लिए 52 वर्ष के बाद स्वर्ण पदक जीता और राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीतने वाली पहली भारतीय महिला धावक बनीं। | కామన్వెల్త్ క్రీడలలో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలుచుకున్న ఏకైక క్రీడాకారుడు మిల్ఖా సింగ్ ఉండేవారు, కానీ 2010 కామన్వెల్త్ క్రీడలలో, 52 ఏళ్ల తరువాత కృష్ణ పునియా భారత్‌కు మహిళల డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం గెలిచి, కామన్వెల్త్ క్రీడలలో అథ్లెటిక్స్ లో స్వర్ణం గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. |
अंजू का विवाह रॉबर्ट बॉबी जॉर्ज से हुआ है, जो तिकड़ी कूद के पूर्व राष्ट्रीय चैंपियन तथा उनके कोच भी हैं। | అంజుకి, ట్రిపుల్ జంప్‌లో మాజీ జాతీయ ఛాంపియన్ మరియు ఆమెకు కోచ్ కూడా అయిన రాబర్ట్ బాబీ జార్జ్‌తో వివాహం అయింది. |
2.0 मीटर प्रति सेकन्ड से अधिक की पीछे से बहती हवा में कोई प्रदर्शन रिकॉर्ड करने के उद्देश्य लायक नहीं माना जाता। | యే ప్రదర్శనకయినా సెకనుకు 2.0 మీటర్ల కంటే అధికంగా అనుకూల దిశలో గాలి వీస్తూ ఉంటే అది రికార్డు ప్రయోజనానికి లెక్కించబడదు. |
1 जनवरी 2010 से पुरुषों को सिर्फ कमर से घुटनों तक के सूट पहनने की इजाज़त है। | 2010 జనవరి 1 నాటికి, పురుషులు కేవలం నడుము నుండి మోకాళ్ళ వరకు ఉండే సూట్లను మాత్రమే వేసుకోవడానికి అనుమతించబడతారు. |
ब्रिस्टल बियर्स (रग्बी संघ) और ग्लौस्टरशर काउंटी क्रिकेट क्लब भी शहर में स्थित हैं। | బ్రిస్టల్ బేర్స్ (రగ్బీ యూనియన్) మరియు గ్లౌసెస్టర్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కూడా ఈ నగరం ఆధారితంగా ఉన్నాయి. |
2014 में सिंगापुर टेबल टेनिस सम्मेलन की अध्यक्षा ली बी वाह ने इस मुद्दे पर अपना पद त्यागा था; उनकी उत्तराधिकारी, एलेन ली ने बाद में चीन में पैदा हुई टेबल टेनिस खिलाड़ी जेंग जियान की नागरिकता के आवेदन की तरफदारी की। | 2014 లో, ఈ విషయమై సింగపుర్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షురాలు లీ బీ వా వైదొలిగారు; ఆమె ఉత్తరాధికారిణి ఎలెన్ లీ, ఆ తరువాత చైనాలో జన్మించిన పాడ్లర్ షెంగ్ జియాన్ పౌరసత్వ దరఖాస్తుకి సుముఖత వ్యక్తీకరించింది. |
1920 के दशक से व्यावसायिक इंजीनियरों ने तीरंदाजी में दिलचस्पी लेना शुरू कर दिया है, जो कि पहले इस कौशल के पारंपरिक विशेषज्ञों का विशिष्ट कार्यक्षेत्र था। | గతంలో సంప్రదాయ చేతిపనుల నిపుణుల ప్రత్యేక అంశమైన విలువిద్యలో,1920ల నుండి, వృత్తిపరమైన ఇంజనీర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. |
उआन मैनुअल फांज़ियो को, जिन्होंने 184 अंतर्राष्ट्रीय दौड़ों में से 102 जीतीं, और जो चार अलग-अलग टीमों के तहत पांच बार फॉर्मूला वन विश्व चैंपियन बने, व्यापक रूप से आज तक के महानतम ड्राइवर के रूप में स्थान दिया गया है। | హ్వున్ మన్వల్ ఫంక్యో నాలుగు వివిధ బృందాల క్రింద, 184 అంతర్జాతీయ రేసుల్లో 102 టిని గలిచి, ఐదు సార్లు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు, ఈ రోజు వరకు సర్వత్రా అత్యుత్తమ డ్రైవరుగా పరిగణించబడతాడు. |
भारत में बेटन कप तथा आगा खान टूर्नामेंट दस साल के अंदर शुरू हो गए। | పదేళ్ళ లోపు, భారత్‌లో బైటన్ కప్ మరియు అగాఖాన్ టోర్నమెంట్లు ప్రారంభించబడ్డాయి. |
मई 2012 में दीपिका कुमारी ने अंताल्या, टर्की में विश्व कप में व्यक्तिगत चरण के रिकर्व में अपना पहला स्वर्ण पदक जीता। | 2012 మేలో, టర్కీలోని అంటాల్యలో దీపికా కుమారి తన మొదటి వర్ల్డ్ కప్ వ్యక్తిగత స్టేజ్ రీకర్వ్ బంగారు పతకం గెలుచుకుంది. |
उसने कहा कि पिछले दो वर्षों से उसे वेतन नहीं दिया गया था और बाद में होने वाली खेल प्रतियोगिताओं के लिए भी उसकी छुट्टियों को प्राधिकरण ने मंजूरी नहीं दी थी। | గత రెండేళ్లగా తనకు వేతనం చెల్లించబడలేదని, అలాగే తదుపరి ఆటలకు అధికారులు సరిగా సెలవులు మంజూరు చేయలేదని ఆమె అన్నారు. |
शारीरिक विकास, रूप, और व्यक्तित्व के आधार पर प्रतिस्पर्धी दलों का मूल्यांकन किया गया। | సంభావ్య పోటీదారులు వారి శారీరక ఎదుగుదల, స్వరూపం మరియు వ్యక్తిత్వాలను బట్టి అంచనా వేయబడ్డారు. |
अशोक कुमार ने सबसे महत्वपूर्ण गोल मारकर भारत को विश्व कप में एकमात्र जीत दिलाई। | వరల్డ్ కప్ లో భారత్ ఏకైక విజయం సాధించడానికి అశోక్ కుమార్ గెలుపుకి కారణమైన అతి కీలక గోలు చేశాడు. |
2014 के राष्ट्रमंडल खेलों में महिलाओं के 55 कि.ग्रा. के फ्रीस्टाइल वर्ग के क्वार्टर फाइनल में, बबीता की पहली प्रतिद्वंद्वी स्काटलैंड की कैथरीन मार्श थी जिसे उसने 92, 40 (वर्गीकरण अंक 4:1) से हराया था। | 2014 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 55 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో, క్వార్టర్ ఫైనల్సులో బబిత తన తొలి ప్రత్యర్థి అయిన స్కాట్‌ల్యాండ్ కు చెందిన కేథ్రిన్ మార్ష్ ను 92, 40 తో ఓడించింది (4:1 వర్గీకరణ పాయింట్లు). |
2015 में कॉमनवेल्थ कराटे खेल दिल्ली, भारत में आयोजित किए गए थे। | 2015 కామన్వెల్త్ కరాటే క్రీడా పోటీలు భారత్‌లోని ఢిల్లీలో నిర్వహించబడ్డాయి. |
पुरुष और महिलाओं के फेंके जाने वाले उपकरणों के वज़न भिन्न होते हैं: पुरुषों का भाला 800 ग्राम का होता है जबकि महिलाओं का 600 ग्राम का, पुरुषों का वज़न फेंक 35 पाउंड का होता है जबकि महिलाओं का 20 का, महिलाओं के 1 किलोग्राम के चक्के की तुलना में पुरुषों का चक्का 2 कि.ग्रा. का होता है, पुरुषों का गोला 16 पाउंड का होता है जबकि महिलाओं का 8 पाउंड का, और पुरुषों का हथौड़ा फेंक 16 पाउंड का होता है जबकि महिलाओं का 8 पाउंड का होता है। | మహిళలు, పురుషులు విసిరే సాధనాలు వేరువేరు బరువులు కలిగి ఉంటాయి: పురుషుల జావెలిన్ 800 గ్రాములతో పోల్చితే మహిళలది 600 ఉంటుంది, పురుషుల వైట్ త్రో 35 పౌన్లతో పోలిస్తే మహిళది 20 ఉంటుంది, పురుషుల డిస్కస్ 2 కిలోగ్రాములతో పోలిస్తే మహిళలది 1 ఉంటుంది, పురుషుల 16 పౌన్ల షాట్ పుట్ తో పోలిస్తే మహిళలది 8 పౌన్లు ఉంటుంది, అలాగే పురుషుల 16 పౌన్ల హ్యామర్ త్రో పోలిస్తే మహిళలది 8 ఉంటుంది. |
2009 में वे मुनाफा कमाने वाली गुजरात क्रिकेट असोसिएशन (जी.सी.ए.) के उपाध्यक्ष बने जबकि मोदी ने अध्यक्ष के रूप में कार्यभार संभाला। | 2009లో, ఆయన లాభదాయకమైన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఎ)కు ఉపాధ్యక్షుడు అవ్వగా, మోడీ దాని అధ్యక్షుడిగా పనిచేసారు. |
एक और प्रारूप है रिले ट्रायथलॉन जिसमें प्रतिस्पर्धी बारी-बारी से दौड़ में प्रतिस्पर्धा करते हैं; प्रत्येक प्रतिस्पर्धी को तैराकी, साइकल चलाने और दौड़ने के खंड को पूरा करना पड़ता है। | రిలే ట్రైయాతలాన్స్ అనేది మరో విధానం, ఇందులో పోటీదారుల జట్టు వంతులవారీగా పందెములో పోటీపడతారు; ఒక్కొక్క పోటీదారు తప్పనిసరిగా ఈత కొట్టుట, సైకిల్ తొక్కుట మరియు పరుగు తీతలలో ఒక విభాగంలో పాల్గొనాల్సి ఉంటుంది. |
आई.सी.सी. नियमों के अनुसार, एक दिवसीय मैच तभी आधिकारिक माना जाता है जब दूसरे नंबर पर बैट करने वाला पक्ष 25 ओवर तक गेंदबाजी का सामना कर चुका हो। | ఐ. సి. సి. నియమాల ప్రకారం, తరువాత బ్యాటింగ్ చెసే పక్షానికి 25 ఓవర్లు బౌలింగ్ చేయబడిన తరువాతే ఒక ఓడిఐ మ్యాచ్ అధికారికం అవుతుంది. |
आरक्षित दिवस पर, श्रीलंकाई खिलाडियों ने पहले बल्लेबाजी करके 222 रन बनाए जिनमें महेला जयवर्धने और रसल आर्नल्ड ने क्रमशः 77 और 56 रन बनाए तथा भारतीय ज़हीर अब्बास ने 44 रन देकर तीन विकट लिए। | రిజర్వ్ డే నాడు ,శ్రీలంకన్లు మరలా తొలిగా బ్యాటింగ్ చేసి, మహేలా జయవర్ధనే, రసెల్ ఆర్నాల్డ్ వరుసగా 77, 56 పరుగులతో 222 పరుగులు చేయగా, భారతదేశ జహీర్ ఖాన్ 44 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. |
अप्रैल 2001 में वरिष्ठ वर्ग की प्रतियोगिताओं में मिर्ज़ा ने 15 वर्ष की आयु में आई.टी.एफ. खेलों में पदार्पण किया और शुरू में ही सफलता प्राप्त करने लगी। | సీనియర్ సర్క్యూట్లో, మిర్జా 2001 ఏప్రిల్‌లో ఐ. టి. ఎఫ్. సర్క్యూట్లో 15 ఏళ్ల వయస్కురాలిగా తొలి ఆట ఆడి ప్రారంభిక ప్రాబల్యం అగపరచడం ప్రారంభించింది. |
मूल रूप से ऐसा सोचा गया था कि यदि अगले 2020-2023 के आई.सी.सी. क्रिकेट विश्व कप क्वालिफायर में दोनों टीमों में से लीग 2 की टीम बेहतर प्रदर्शन करती है तो 13वें स्थान की टीम के बदले लीग 2 को आगामी 2020-2023 आई.सी.सी. क्रिकेट विश्व कप सुपर लीग में आगे बढ़ाया जाएगा। | మొదట్లో, సిడబ్ల్యూసి రెండవ లీగ్ లో అగ్రస్థానంలో ఉన్న జట్టుని 2020-2023 ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ కి, రెండవ లీగ్ జట్టు 2023 క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ లో, రెండు జట్లలో ఆధిక్యత సాధించితే దాన్ని13 వ స్థానంలోని జట్టుకి బదులు పంపించాలని ఉద్దేశించబడింది. |
उन्होंने साकेत माइनेनी के साथ मिल कर चीन के सीयैन यिन पेंग और चान हाओ-चिंग को हराया तथा मिश्रित युगल टूर्नामेंट में स्वर्ण पदक जीता। | ఆమె సాకేత్ మైనేనితో జతకట్టి చైనాకు చెందిన శియెన్ యిన్ పెంగ్, చాన్ హౌ-చింగ్ లను ఓడించి మిశ్రమ జోడు టోర్నమెంటులో స్వర్ణం గెలుగుచ్చుకున్నారు. |
सेमेन्या के देश ने उसकी मर्यादा, उसके अधिकार और विश्व खेलों में उसके स्थान की रक्षा करने में उसका साथ दिया। | సెమెన్య యొక్క దేశం ప్రపంచ క్రీడలలో ఆమె గౌరవం, ఆమె హక్కులు మరియు ఆమె స్థానాన్ని కాపాడటానికి ఆమె చుట్టూ కూడింది. |
2005 में वे पांच महाद्वीपों के समुद्री चैनलों में, जिनमें जिब्राल्टर जलसन्धि, तिरहेनियाई सागर, कुक स्ट्रेट, ग्रीस में टोरोनिक खाड़ी (कसांद्रा की खाड़ी), कैलिफोर्निया तट से दूर कैटेलिना चैनल शामिल हैं, और थ्री एंकर बे से दक्षिण अफ्रीका के केप टाउन के पास रॉबेन द्वीप तक तैरने वाली पहली महिला बनीं। | 2005లో ఐదు ఖండాలలోని సముద్ర జల మార్గాలగుండా, స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్, ది టైరీనియన్ సీ, కుక్ స్ట్రెయిట్, గ్రీస్ లోని టోరోనియస్ గల్ఫ్ (గల్ఫ్ ఆఫ్ కసాండ్ర), కాలిఫోర్నియా తీరాన క్యాటలీనా ఛానెల్, మరియు దక్షిణాఫ్రికా, కేప్ టౌన్ సమీపాన త్రీ యాంకర్ బే నుండి రోబెన్ ఐలాండ్ వరకు ఈదిన మొదటి మహిళ అయ్యింది. |
उनका राष्ट्रीय चैम्पियनशिप में सीनियर स्तर पर राज्य के दल द्वारा सबसे अधिक मेडल जीतने का राष्ट्रीय रिकॉर्ड है। | సీనియర్ స్థాయిలో ఒక రాష్ట్ర జట్టుకి జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు కలిగి ఉన్న జాతీయ రికార్డు ఆమె సొంతం. |
वे पहली महिला बास्केटबॉल खिलाड़ी हैं जो 2006 के राष्ट्रमंडल खेल तथा 2010 एवं 2014 के एशियाई खेलों में राष्ट्रीय दल में भारत की ओर से खेली हैं। | ఆమె 2006 లో ఒక కామన్వెల్త్ క్రీడలు మరియు 2010, 2014 లో వరుసగా రెండు ఆసియా క్రీడలలో జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. |
इस बीच, लाहिड़ी ने दो यूरोपियन टूर विजयें और सात एशियन टूर विजयें प्राप्त कर ली हैं। | మరోవైపు, లహిరి రెండు యురోపియన్ టూర్ విజయాలు మరియు ఏడు ఆసియన్ టూర్ విజయాలు కలిగి ఉన్నాడు. |
वह लोकप्रिय हुई जब उसने 2002 में दक्षिण कोरिया के बूसान में हुए एशियाई खेलों में रजत पदक जीता। | ఆమె బూసాన్, దక్షిణ కొరియాలో 2002 ఆసియా క్రీడలలో రజత పతకం గెలిచి ప్రసిద్ధికెక్కింది. |
समग्र रूप से इन चारों प्रतियोगिताओं को मेजर या स्लैम (एक शब्द जो बेसबॉल के बजाए ब्रिज के खेल से लिया गया है) कहते हैं। | ఈ నాలుగు ఈవెంట్లను కలిపి, మేజర్స్ లేదా స్లామ్స్ అంటారు (ఈ పదం బేస్‌బాల్ కంటే కూడా బ్రిడ్జ్ నుండి అరువు తీసుకోబడినది). |
क्रीड़ांगण में ओलंपिक झंडा इन आठ पूर्व ओलंपिक चैंपियनों ने चारों ओर घुमाया: बिल रॉयक्रॉफ्ट, मुरे रोज़, लिऐन टूथ, गिलियन रॉल्टोन, मार्जरी जैकसन, लॉरेन क्रैप, माइकल वेंडेन और निक ग्रीन। | ఒలింపిక్ పతాకాన్ని మైదానం చుట్టూ ఎనిమిది మంది ఆస్ట్రేలియా మాజీ ఒలింపిక్ ఛాంపియన్లు మోసుకు తిరిగారు: బిల్ రాయ్క్రాఫ్ట్, ముర్రే రోజ్, లియాన్ టూత్, గిలియన్ రాల్టన్, మార్జోరీ జాక్సన్, లోరైన్ క్రాప్, మైకేల్ వెన్డెన్ మరియు నిక్ గ్రీన్. |
सिडनी ओपेरा हाउस की पृष्ठभूमि में स्विट्ज़रलैंड की ब्रिजेट मैक्मोहन ने पसंदीदा घरेलू खिलाड़ी मिशेली जोन्स, जिन्हें रजत पदक मिला, को हराते हुए तैराकी की, साइकल चलाई और दौड़ लगा कर खेल में स्वर्ण पदक जीता । | సిడ్నీ ఒపెరా హౌస్ పరిసరాల్లో జరిగిన ఈ క్రీడలలో స్విట్జర్లాండ్ కి ప్రాతినిధ్యం వహించిన బ్రిజిట్ మెక్‌మహాన్ ఈత కొట్టి, సైకిల్ తొక్కి, పరుగు తీసి ఇందులో రజతం గెలుచుకున్నఅభీష్ట మైకేల్ జోన్స్ వంటి స్థానిక క్రీడాకారులను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. |
ट्रायथलॉन ने ओलंपिक में अपना पदार्पण महिलाओं की दौड़ के साथ किया। | మహిళల పోటీతో ట్రయాథ్లాన్ దాని ఒలింపిక్ ప్రవేశం చేసింది. |
असली जीवन में "कुट्टीनारायन " कहलाए जाने वाले इस हाथी की सात साल की उम्र में एक दुर्घटना में टाँग टूट गई थी जब वह एक सेप्टिक टैंक में गिर गया था। | నిజం జీవితంలో "కుట్టినారాయణన్" అనే పేరు గల ఈ ఏనుగు ఏడేళ్ళ ప్రాయంలో విషజలతటాకములో అడుగు పెట్టి ఆ ప్రమాదంలో కాలు విరగకొట్టుకుంది. |
इस फर्मे में 1875 में संशोधन करके वर्तमान कोर्ट का प्रारूप बनाया गया, जिसमें चिह्नन विंगफील्ड संस्करण के समान थे लेकिन उनके कोर्ट के रेतघड़ी के आकार के बजाय कोर्ट आकार का आयत था। | 1875 లో ఈ నమూనాను, వింగ్ఫీల్డ్ రూపాంతరణాన్ని పోలిన గుర్తులతో, ప్రస్తుతం వాడుకలోనున్న ఆట స్థల రూపానికి సవరించారు, కానీ ఇసుక గడియారం ఆకారములోని అతని ఆట స్థలాన్ని దీర్ఘ చతురస్రానికి మార్చారు. |
अमेरिका के कम दूरी की तेज गति दौड़ में प्रभुत्व को यूनाइटेड किंगडम का अपेक्षाकृत लंबी पथ-दौड़ों में प्रभुत्व टक्कर देता है। | స్వల్ప దూర పరుగుపోటీలో యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆధిక్యతను యునైటెడ్ కింగ్డమ్ సుదీర్ఘ పరుగుపోటీలలో సరి చేసింది. |
दूसरी बारी में, उसने ऐन कियॉथवॉन्ग को मात देकर क्वॉर्टर फाइनल में प्रवेश किया जहां वह शैह सू-वे से हार गई। | రెండో రౌండ్లో, ఆమె అన్నే కియోతవాంగ్ను ఓడించి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది, అక్కడ ఆమె హ్సీహ్ సు-వీ చేతిలో ఓడిపోయింది. |
अपनी कलाकृतियों में इस खेल को दर्शाने वाले अन्य फ्रेंच कलाकारों में ऐल्बर्ट ग्लीज़ेस ले जोउर की द फुटबॉल. (1912), रॉबर्ट डिलौनी की फुटबॉल ल' इक्विप द कार्डिफ (1916), और आन्द्रे ल्होटे की पार्टी ड रगबी (1917) थे। | ఈ క్రీడను తమ కళాఖండాలలో వర్ణించిన ఇతర ఫ్రెంచి కళాకారులు ఆల్బర్ట్ గ్లెజ్' లె జువర్స్ ది ఫుట్‌బాల్ (1912), రాబర్ట్ డెలూనే ఫుట్‌బాల్. లెకిప్ ది కార్డిఫ్ (1916), మరియు ఆండ్ర్ ల్హోట్ పార్టీ ది రగ్బీ (1917). |
अन्य भारतीय पाक-शैलियाँ भी इस क्षेत्र में उपलब्ध हैं, यद्यपि सड़क पर मिलने वाले खाद्यों में उत्तर भारतीय भोजन खास होता है। | ఈ వీధిలో ఉత్తర భారత ఆహారం ప్రత్యేకమైనప్పటికీ ఇతర భారతీయ వంటకాలు కూడా ఈ ప్రాంతంలో లభ్యమవుతాయి. |
अज़रबैजान राज्य फिलहार्मोनिक हॉल, अज़रबैजान राज्य शैक्षणिक ओपेरा, और बैले थियेटर बाकू के सांस्कृतिक स्थल हैं। | బాకూలోని సాంస్కృతిక వేదికలలలో కొన్ని ది అజర్బైజాన్ స్టేట్ ఫిలార్మోనిక్ హాల్, ది ది అజర్బైజాన్ స్టేట్ అకడెమిక్ ఒపెరా, మరియు బ్యాలె థియేటర్. |
वानुअतु और सॉलोमोन द्वीपों में भी प्राकृतिक आकर्षणों की कोई कमी नहीं है, लेकिन चूँकि इन दोनो देशों में पर्यटक कम जाते हैं, इसलिए इन क्षेत्रों के महत्व को असलियत से कम आंका गया है। | వనువాతు మరియు ది సోలోమన్ ఐలాండ్స్ కూడా సహజ ఆకర్షణలకు ఏమాత్రం తగ్గవు; అయినా, ఈ రెండు దేశాలకు పర్యాటకులు తక్కువగా వస్తున్నందున, ఆ ప్రాంతాల ప్రధానాకర్షణలు అంతగా ప్రసిద్ధి పొందలేదు. |
सितम्बर 2016 से शेनज़ेन और हॉन्ग कॉन्ग की सीमा के बीच सीमा के आरपार जाने के नौ स्थान थे जिनमें से छः ज़मीनी स्थान थे। | 2016 సెప్టెంబర్ నాటికి, షెన్జెన్, హాంగ్ కాంగ్ల మధ్య గల సరిహద్దు మీద దాటడానికి వీలు కల్పించే తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో ఆరు భూ అనుసంధానాలు. |
बांग्लादेशी गाँवों में मिट्टी, पुआल, लकड़ी और बाँस जैसी प्राकृतिक सामग्री से बने फूस की छत वाले घर होते हैं। | బంగ్లాదేశీ గ్రామాలు, సహజ పదార్ధాలు అయిన మట్టి, ఎండుగడ్డి, కలప, మరియు వెదురుతో తయారైన పూరికప్పుగల ఇళ్ళు కలిగి ఉంటాయి. |
अफ्रीका के इस भाग में आपको मिलेगा सर्वोत्कृष्ट सवाना सफारी का अनुभव, जहां आप शेर, चीते और हाथी देखने के लिए लैंड रोवर में बैठ कर मैदानो में निकलते हैं। | ఆఫ్రికాలోని ఈ భాగంలోనే మీరు సర్వోత్కృష్టమైన సవానా పచ్చికబయళ్ళ సఫారీని అనుభూతి పొందవచ్చు, ఒక ల్యాండ్ రోవర్ లో సాహస ప్రయాణం చేస్తూ ఈ బయళ్ళగుండా సింహాలు, చిరుతలు మరియు ఏనుగులను కనుగొనవచ్చు. |
1929 में रेजिनाल्ड इनेस पोकॉक ने इसे पैंथेरा वर्ग के अधीन कर दिया था। | 1929లో రెజినాల్డ్ యినేజ్ పోకక్ దీనిని పాన్థ్యరా ప్రజాతి క్రిందికి చేర్చారు. |
बालिपारा से 15 कि.मी. और भी है - आप या तो ईटानगर-बॉमडिला बस ले सकते हैं जो बालिपारा से करीब 11 बजे सुबह गुजरती है और नमेरी बस स्टॉप (वहाँ पर आप "भालुकपौंग 22 कि.मी." का मील का पत्थर देखेंगे) पर उतारती है या वहाँ कई शेयर टैक्सी वालों के साथ मोल-तोल करके नमेरी बस स्टॉप तक चले जाएं। | బలిపారా నుండి, మరొక 15 కి. మి. లు ఉంటుంది- మీరు ఇటానగర్ - బోండిలా బస్ ఎక్కితే సుమారు ఉ. 11 గం. కు బలిపారా దాటుకుంటూ మిమ్మల్ని నమెరి బస్ స్టాప్ వద్ద దించుతుంది (మీకు అక్కడ "భలుక్పోంగ్ 22 కి. మి." అనే మైలురాయి కనపడుతుంది) లేదా అనేక షేరింగ్ ట్యాక్సీలలో ఒకదాన్ని నమెరి బస్ స్టాప్ వద్ద దించడానికి బేరమాడుకోవచ్చు. |
गोवा में दो विश्व धरोहर स्थल हैं: बॉम जीसस बेसिलिका और पुराने गोवा के चर्च और कॉन्वेंट। | గోవాలో గల రెండు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు: బొమ్ జీసస్ బసిలిక మరియు ఓల్డ్ గోవాలోని చర్చీలు మరియు సన్యాసినుల మఠాలు. |
ग्रैंड मिस्री संग्रहालय मिदान तहरीर में सम्मान्य मिस्री संग्रहालय का बहु-प्रतीक्षित प्राथमिक प्रतिस्थापन है जिसमें प्रदर्शनी, भंडारण और कार्य स्थान के लिए ज्यादा बड़ी जगह है। | మిదాన్ తాహ్రిర్ లోని గణ్యమైన ఈజిప్షియన్ సంగ్రహాలయానికి బదులుగా మరింత పెద్ద ప్రదర్శన, భాండారం మరియు కార్యాలయ ప్రదేశాలతో ది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఎన్నాళ్లగానో వేచి చూస్తున్నప్రాథమిక పునఃస్థాపనం. |
ग्वालियर एक महत्वपूर्ण ऐतिहासिक और पर्यटन क्षेत्र है; इसलिए पर्यटन क्षेत्र का शहर की अर्थव्यवस्था पर भी प्रभाव पड़ता है। | గ్వాలియర్ దేశంలోని ఒక ముఖ్యమైన చారిత్రాత్మక పర్యాటక ప్రాంతం; అందువల్ల, పర్యాటక రంగం కూడా నగర ఆర్థిక వ్యవస్థమీద ప్రభావం చూపుతుంది. |
बाद में इसके सीमांत बस्ती होने के सम्मान में अंतरीप का नाम बदल कर उत्तमाशा अंतरीप कर दिया गया। | తరువాత ఈ భూశిరమును ఈ బాహ్య సైనిక స్థావర ఉపస్థితి గౌరవార్థం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు మార్చడం జరిగింది. |
क्यूबा के अधिकारियों का अनुमान है कि 1999 में मोटे तौर पर 16 लाख पर्यटक क्यूबा की सैर करने आए, जिससे सकल राजस्व में लगभग 190 करोड़ डॉलर की कमाई हुई। | 1999 లో సుమారు 1 లక్ష 60 వేల మంది పర్యాటకులు క్యూబా సందర్శించారని, తద్వారా $1.9 బిలియన్ స్థూల ఆదాయం లభించిందని క్యూబా అధికారుల అంచనా. |
इस क्षेत्र के भोजन पर अरब, सीरियाई, पुर्तगाली, डच, यहूदी और मध्य पूर्वी प्रभाव बहुत हद तक मौजूद है। | ఈ ప్రాంత వంటకాలలో గణనీయంగా అరబ్, సిరియా, పోర్చుగీస్, డచ్, యూదు, మరియు మధ్యప్రాచ్య ప్రభావాలు ఉంటాయి. |
लोनावला महाराष्ट्र में एक पहाड़ी स्थल है, और आपको यहां पर गर्म मसाला चाय या वड़ापाव (शाकाहारी भारतीय बर्गर जिसमें बेसन में लपेटकर तली गई आलू की टिक्की को बीच में लगाया जाता है) जरूर सेवन करना चाहिए। | మహారాష్ట్రలోని లోనావలా ఒక పర్వతప్రాంత పట్టణం, ఇక ఇక్కడి వేడి మసాలా తేనీరు లేదా వడాపావ్ (బంగాళా దుంపల ముద్దని శనగపిండిలో ముంచి వేయించి మధ్యలో పూరకంగా పెట్టే శాఖాహార భారతీయ బర్గర్)ని అసలు వదులుకోలేరు. |
मदांग हर स्तर की स्कूबा डाइविंग के लिए अच्छा है, और प्रवाल भित्तियों में विभिन्न प्रकार की दुर्लभ प्रजातियों की रंग-बिरंगी मछलियों पाई जाती हैं। | మాదంగ్ అన్ని స్థాయిల స్కూబా డైవింగ్ కి అనువైనది, అలాగే ఈ పగడపు దిబ్బలు అరుదైన రంగురంగుల మత్స్యజాతులకు నెలవు. |