inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భవిష్యత్ భారతం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భవిష్యత్ భారతం' రాబోయే రోజుల్లో బస్సులో కనిపించే పోస్టర్లు ఇలా ఉండబోతాయి. ‘‘15 రోజుల్లో మీ వాట్సాప్, ఫేస్బుక్ అలవాటును మాన్పిస్తాం. అలా చేయలేకపోతే మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం ... గ్యారెంటీ!’’
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఫ్రిజ్ లోటు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఫ్రిజ్ లోటు' బంటి: రేయ్, రోజు రోజుకీఇలా లావవుతున్నావేంటి? చంటి: మా ఇంట్లో ఫ్రిజ్ లేదు రా ... బంటి: ఫ్రిజ్కీ లావుకీ ఏంటి సంబంధం? చంటి: వండినవన్నీ మిగల్చకుండాతినేయాలి కదా.
8
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బెడిసికొట్టిన తంత్రం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బెడిసికొట్టిన తంత్రం' ఆ ఊళ్లో ఒకడు మాత్రమే మాంసాహారి - మిగతావారంతా శాకాహారులే. మాంసాహారి వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామపెద్దకి ఫిర్యాదు చేశారంతా. గ్రామపెద్ద మాంసాహారితో ‘నువ్వు కూడా శాకాహారిగా మారిపో. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండద’ని చెప్పాడు. సరేనని తల ఊపాడు మాంసాహారి. గ్రామపెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి ‘‘నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి’’ అన్నాడు. మరుసటిరోజు మళ్లీ అదే ఇంటి నుంచి చికెన్ వాసన వచ్చింది. గ్రామపెద్ద, గ్రామస్తులతో కలిసి వెళ్లి చూస్తే...మాంసాహారి, చికెన్ మీద గంగాజలం చల్లుతూ ‘‘నువ్వు పుట్టుకతో కోడివి. ఇక నుండి బంగాళాదుంపవి’’ అంటున్నాడు.
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తేడా ఎక్కడుందో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేడా ఎక్కడుందో!' లోకంలో భర్తలందరూ ‘మా అమ్మ బెస్ట్’ అంటారు. కానీ భార్య విషయానికి వచ్చేసరికి పక్కింటోడి భార్యే బెస్ట్ అంటారెందుకు చెప్మా?
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రోగం కుదిరింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రోగం కుదిరింది' వయసు మళ్లిన దంపతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక దెయ్యం వచ్చి, ‘‘మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మానాన్నా గుర్తుకు వస్తున్నారు. ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను ...’’ అని అంది. దానికి ముసలావిడ ‘‘నాకు మా ఆయనతో కలిసి లోకమంతా చుట్టి రావాలని ఉంది’’ అంది. దెయ్యం చేతిని గాలిలో తిప్పి ‘‘ఇదిగో ఫ్లైట్ టికెట్స్ - ఎంజాయ్’’ అంది. ‘‘నాకు నా వయసుకన్నా 30 ఏళ్లు చిన్న వయసు భార్య కావాలి’’ అని అడిగాడు భర్త ‘‘సరే, ఓం ... బూమ్ ... బుస్’’ అని మంత్రమేసి మాయమైందా దెయ్యం. తీరా చూస్తే 60 ఏళ్ల ముసలాయన కాస్తా 90 ఏళ్ల ముసలాడిలా అయ్యాడు.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పిచ్చి ... పకోడి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిచ్చి ... పకోడి' అమ్మాయి: నీ ప్రేమలో పడి నేను పిచ్చిదాన్ని అయిపోయాను. అబ్బాయి: అబ్బో నేను మాత్రం కలెక్టర్ అయిపోయానా - రోడ్డు పక్కన పకోడీలు అమ్ముకుంటున్నా.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సర్వం నాశనం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సర్వం నాశనం!' అంతర్జాలం - ఆత్మనాశిని గూగుల్ - గుణనాశిని చరవాణి - బుద్ధినాశిని కంప్యూటర్, సోషల్ మీడియా - సంఘనాశిని సినిమాలు, వార్తాపత్రికలు - వ్యవహారనాశిని వార్తాచానెళ్లు, టీవీ సీరియళ్లు - సర్వనాశిని!
13
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తస్మాత్ జాగ్రత్త! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తస్మాత్ జాగ్రత్త!' అత్యవసర పరిస్థితుల్లో కూడా భార్య దగ్గర అప్పు అస్సలు తీసుకోకూడదు. 4 నెలల క్రితం నేను 2 వేలు తీసుకున్నా. ఇప్పటికి 3 సార్లు పూర్తిగా ఇచ్చేశా ... అయినా ఇంకా 1,500 బాకీ మిగిలే ఉంది.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఐపు లేదు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఐపు లేదు!' రామారావు : ఏమిటి చాలారోజులుగా మీ ఆవిడ కనబడడం లేదు? సుబ్బారావు: ఏమో నాకూ తెలియదు. పండక్కి నగలు కొనడానికి వనితా జ్యువెలరీకి వెళ్లాం. అక్కడ ఫోటోలు తీసి యెస్టిమేటు వేయించుకుని మిగతా షాపుల్లో పోల్చి చూస్తానని వెళ్లింది. అంతే అడ్రసు లేదు. ఏ షాపులో వెతుకుతోందో ఏమో!
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక హైటెక్ జ్యోతిష్కుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'హైటెక్ జ్యోతిష్కుడు' ‘మీ నామ, నక్షత్ర, రాశికి సరిపోవు అదృష్ట రత్నం సూచించబడును’ అని బోర్డు పెట్టాడు జ్యోతిష్కుడు - ఒక్కరు కూడా ఆ వైపు చూడలేదు. మరుసటి రోజు ... ‘మీ నామ, నక్షత్ర, రాశికి సరిపోవు సెల్ఫోన్ ఏదో సూచించబడును’ అని బోర్డు మార్చాడు. కొద్ది నిమిషాల్లోనే జనాలు క్యూ కట్టారు.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సంస్కారం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సంస్కారం' ‘‘మమకారానికి, సంస్కారానికి తేడా ఏంటి స్వామి?’’ ‘‘నీ పోస్టుకు నువ్వే లైక్ కొట్టుకుంటే మమకారం ... అదే వేరేవాళ్లకి లైక్కొడితే సంస్కారం నాయనా!’’
11
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దొంగ తెలివి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దొంగ తెలివి' గజదొంగ గంగులు భార్యాభర్తలిద్దరినీ కట్టేసి ఆ ఇంట్లోని నగలన్నీ మూటకట్టుకున్నాడు. వెనక్కి వెళ్లేముందు బుర్రలో ట్యూబ్లైట్ వెలిగింది. ‘‘ఈ నగలను ఎలాగూ నేను బయట అమ్ముకోవాల్సిందే కదా. మీరే కొనుక్కుంటే పోలా .. మీకయితే 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తా’’ అని బేరాలు సాగించాడు.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పీచమణచండి ప్లీజ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పీచమణచండి ప్లీజ్!' చిత్తుగా మోసపోయిన ఒక ఖాతాదారుడు, ప్రధానికి ఒక విన్నపం చేస్తూ ‘‘మోదీ గారు ... దయచేసి ఫేస్బుక్ అకౌంట్లని కూడా ఆధార్తో లింకు చేసే రూల్ పెట్టండి. వెధవలు అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి అకౌంట్లు సృష్టించి నాలాంటి వారిని ఆశ పెట్టి చంపుతున్నారు’’ అని మొరపెట్టుకున్నాడు.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అభయసుందరి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అభయసుందరి' భర్త: నాకు భయం లేదు. నువ్వంటే అస్సలు భయం లేదు. (కోపంగా అరిచాడు) భార్య: పెళ్లిచూపులకు మీతో పాటు నలుగురిని తీసుకొచ్చారు. పెళ్లికి 400 మందితో వచ్చారు. భర్త: అవును ... ఐతే ఏంటి? భార్య: నేను మాత్రం ఒక్కదాన్నే మీ ఇంట్లోకి ధైర్యంగా అడుగుపెట్టాను. ఇప్పుడు చెప్పండి ఎవరు పిరికివాళ్లో..!
6
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బెండకాయ బతుకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బెండకాయ బతుకు' భర్త: నాకు ఇష్టం ఉండదని తెలిసి కూడా ఇన్ని బెండకాయ ఐటమ్స్ చేశావేంటి? (కయ్యిమన్నాడు) భార్య: మీ ఎఫ్.బీ ఫ్రెండ్ సరళ తన వాల్పైన బెండకాయ ఫోటో పెడితే ‘వావ్ నోట్లో నీళ్లూరుతున్నాయి. ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉందం’టూ కామెంట్ పెట్టారుగా. మూసుకు తినండి. నీళ్లు ఎలా ఊరుతాయో నేనూ చూస్తాను (గరిటె గాల్లోకి తిప్పింది).
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బుర్రున్నోడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బుర్రున్నోడు' పార్టీకి వచ్చిన వాళ్ళని చూసి ఆ భార్యాభర్తలిద్దరూ నోరెళ్లబెట్టారు. పిలిచింది యాభైమందిని. ఆ యాభైమందినిగాక, ఓ పదిమందిని ఎగసా్ట్ర వేసుకున్నారు. మొత్తం అరవైమందికి మాత్రమే డిన్నర్ ఏర్పాటుచేశారు. తీరా చూస్తే వందమందికి పైనే ఉన్నారు. ఇప్పుడెలా? తలలు పట్టుకున్నారిద్దరూ. ఎవర్ని వెళ్లిపొమ్మనాలి. ఎలా వెళ్లిపొమ్మనాలి? అంతుచిక్కలేదు. అంతలో భర్తకు ఓ ఆలోచన తట్టింది. అందర్నీ ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. ‘‘ఇక్కడికి పెళ్లికూతురి తరుపున వచ్చినవాళ్లు దయచేసి లేచి నిలబడండి’’. ఓ పాతికమంది నిల్చున్నారు. ‘‘గుడ్! ఇప్పుడు పెళ్లికొడుకు తరుపున వచ్చిన వాళ్లు కూడా లేచి నిలబడండి’’. ఓ ముప్పయిమంది దాకా నిల్చున్నారు. ‘‘వెరీగుడ్! అయ్యా! ఇక్కడ జరుగుతున్నది పెళ్లికాదు, బర్త్డే ఫంక్షన్. దయచేసి పెళ్లికి వచ్చినవారు వెళ్లిపోతే ఆనందిస్తాం’’
12
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సేమ్ టు సేమ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సేమ్ టు సేమ్' చూడు భయ్యా... ప్రేమా, దోమా రెండు ఒక్కటే. ఒకటి నిద్ర రాకుండా చేస్తుంది, ఇంకోటి నిద్ర పోకుండా చేస్తుంది.
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పిల్లి ... పులి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిల్లి ... పులి' ముస్తాబై వెళుతున్న పిల్లిని ‘‘ఎక్కడికి వెళుతున్నావ్’’ అడిగింది కుందేలు. ‘‘మా తమ్ముడు పులి పెళ్లికి’’ అంది పిల్లి. ‘‘అదేమిటి నువ్వేమో పిల్లిలా ఉన్నావు, మీ తమ్ముడు పులి అంటావేమిటి?’’ నిలదీసింది కుందేలు. ‘‘అదా.. పెళ్లికి ముందు నేనూ పులినేలే’’ నిట్టూర్చింది పిల్లి.
7
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రేమ పిసినార్లు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రేమ పిసినార్లు' ఒక పిసినారి అబ్బాయి, పీనాసి అమ్మాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి: నేను మా డాడీ పడుకున్నాక ఒక రూపాయి కాయిన్ కింద పడేస్తాను. అదే సిగ్నల్ అనుకుని పైకి వచ్చేయ్. అబ్బాయి: ఓకే ఓకే... ష్యూర్. ఒక పది నిమిషాల తర్వాత... కాయిన్ కింద పడిన శబ్దం వచ్చింది. కానీ, అబ్బాయి ఆ రోజు రాత్రి పైకి వెళ్లలేదు. తర్వాత రోజు పొద్దున్నే ... అమ్మాయి: నిన్న రాత్రి ఎందుకు రాలేదు. సిగ్నల్ వినిపించలేదా? అబ్బాయి: అదేం కాదు. వినిపించింది. అమ్మాయి: మరి ఎందుకు రాలేదు?? అబ్బాయి: కాయిన్ పడేశావ్గా, అది వెతుకుతూ రాత్రంతా కిందే ఉండిపోయా. నా బ్యాడ్లక్ .. కాయిన్ దొరకలేదు. అమ్మాయి: ఇడియట్, కాయిన్కి దారం కట్టి విసిరాను. కింద పడి శబ్దం రాగానే, పైకి లాగేసా!
9
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అనుభవసారం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుభవసారం' ఆనందం: భార్యాభర్తలు అంటే ఎవరు స్వామీ? స్వామీజీ: జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి, భయపడుతూ బతికేవాడు భర్త. భయపడినట్టు నటించి, భర్తను భయపెట్టి బతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్లే నాయనా...
9
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ యాడ్స్లో జీవితం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'యాడ్స్లో జీవితం' కాలేజీ జీవితం జియో సిమ్ లాంటిది, ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంటుంది. బ్యాచిలర్ జీవితం ఎయిర్టెల్ లాంటిది, అంత స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. ఎంగేజ్మెంట్ ముందు జీవితం ఐడియా లాంటిది, ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. పెళ్లయ్యాక వొడాఫోన్, ఎక్కడికెళ్లినా నెట్వర్క్ ఫాలో అవుతుంది. పిల్లలు పుట్టాక బీఎస్ఎన్ఎల్, అన్ని లెన్లూ ఎప్పుడూ బిజీగా ఉంటాయి. ఓవరాల్గా ఇదీ జీవితమంటే!
9
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దొందూ దొందే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దొందూ దొందే' హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు. అయినా ఏ రోజూ వంట చేయదు. గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి. హరి: ఎందుకని? గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు. అయినా రోజూ వండి పెడుతుంది.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దూరాలోచన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దూరాలోచన' ‘‘పరీక్ష పాసయితే బైక్ కొనిస్తానని చెప్పా కదరా ... మరెందుకు ఫెయిలయ్యావు?’’ నిలదీశాడు తండ్రి. ‘‘టైమంతా బైక్ నేర్చుకోవడానికే సరిపోయింది డాడీ! చదవడానికి కుదర్లేదు’’ నిజాయతీగా చెప్పాడు కొడుకు.
13
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డ్రింక్ అండ్ కాల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'డ్రింక్ అండ్ కాల్' తండ్రి (ఫోన్లో) : తాగినప్పుడు కారు నడపకు నాన్నా! కొడుకు: నువ్వు తాగి నప్పుడు కాల్ చేయకు నాన్నా. తండ్రి: నీకెలా తెలుసురా నేను తాగుతున్నానని! కొడుకు: నువ్వు నాకు కారు ఎప్పుడు కొనిచ్చావ్ నాన్నా?
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆవాసనం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆవాసనం' ఆవాలు బరువు తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కిలో ఆవాలను గచ్చు నేల మీద వేయాలి. ఆ తర్వాత ఒక ఖాళీ గిన్నెను ఎత్తైన గట్టుమీద ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఆవ గింజనూ ఏరి ఆ గిన్నెలో వేయాలి. ఆవాలు మొత్తం గిన్నెలోకి వచ్చేదాకా ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. రెండు నెలల్లో మీరు సన్నగా అవ్వడం గ్యారెంటీ! గమనిక: ఆవాలకు బదులుగా గసగసాలు కూడా వాడవచ్చు.
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వర్రీ మ్యాన్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వర్రీ మ్యాన్' పెళ్లి కానప్పుడు- స్పైడర్ మాన్ పెళ్లి కుదిరినప్పుడు- సూపర్ మాన్ పెళ్లి తర్వాత- జెంటిల్ మాన్ పెళ్లాం అందంగా ఉంటే - వాచ్మాన్
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రిసెర్చ్ రిపోర్ట్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రిసెర్చ్ రిపోర్ట్' టీ, కాఫీలు తాగడం చాలా ప్రమాదకరం అని నిన్న నేను చేసిన సర్వేలో తేలింది. నిన్న నేను పబ్కి వెళ్లి, నాలుగు బీర్లు తాగి, రాత్రి రెండింటికి ఇంటికి వచ్చా. ఇంట్లో మా ఆవిడ నాకోసం వెయిట్ చేస్తూ రెండు టీలు, ఒక కాఫీ తాగింది. ఇక్కడే అసలు రిసెర్చ్ మొదలైంది. బీర్లు తాగి వచ్చిన నేను ప్రశాంతంగా శాంతంగా పడుకున్నాను. కాని టీ తాగిన మా ఆవిడ మాత్రం ఎంతో వయెలెంట్గా అరుస్తూ కేకలు పెడుతూ కరాళ నాట్యం చేసింది. అంటే టీ తాగితే మనుషులు సంయమనం కోల్పోతారని... తేలిపోయింది.
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఈగ ఈగే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఈగ ఈగే!' స్వామీజీ: సందర్భాన్ని బట్టి మనుషుల నైజం మారుతుంది. అప్పాజీ: ఏదీ ఒక ఉదాహరణ చెప్పండి స్వామీజీ: ఛాయ్ కప్పులో ఈగ పడితే పారబోస్తారు. అదే నెయ్యి గిన్నెలో పడితే తీసేసి వాడుకుంటారు.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రక్షణ అవసరం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రక్షణ అవసరం' భార్య: ఏమండీ... శివుడూ, పార్వతీ ఉండే ఫోటోల్లో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. విష్ణువూ, లక్ష్మీ ఉండే ఫోటోల్లో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది. శ్రీరాముడూ, సీతా ఉండే ఫోటోల్లో రాముడి చేతిలో విల్లు ఉంటుంది. అయితే కృష్ణుడూ, రాధ ఉండే ఫోటోల్లో మాత్రం కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి ఉంటుంది. ఎందుకని? భర్త: అదేమీ లేదే.. నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్లూ భార్యలతో ఉన్నారు. కాబట్టి ఆయుధాలతో ఉన్నారు. కృష్ణుడు మాత్రం ప్రియురాలితో ఉన్నాడు కాబట్టి ఆయుధం అవసరం లేకుండా పోయింది. దీని మూలంగా తేలిందేమంటే దేవుడయినా సరే భార్యతో ఉన్నప్పుడు తనని తాను కాపాడుకునేందుకు ఆయుధం అవసరమే అని.
5
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వర్షాకాలం సలహా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వర్షాకాలం సలహా!' మనకు కన్నీరు వస్తే తుడవడానికి చాలా మంది స్నేహితులు వస్తారు. కానీ జలుబు చేస్తే ముక్కు తుడవడానికి ఎవరూ రారు. మనమే తుడుచుకోవాలి. అందుకే జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడుతున్నాయి. తడవకండి.
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అజాగ్రత్త ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అజాగ్రత్త' వంటగదిలో గిన్నెలు తోముతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త ఆవేదన ‘‘పదివేలు- పాతికవేలు పోసి కొనే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషీన్, మొబైల్ ఫోన్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని కూడా ముట్టుకోనివ్వరు. అలాంటిది, లక్షలు పెట్టి కొన్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలీ? డబ్బంటే లెక్క లేదు ఆడవాళ్లకు!’’
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చాలా తేలిక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చాలా తేలిక' డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న పేషెంట్తో... డాక్టర్: ఇప్పుడు తేలిగ్గానే అనిపిస్తోందా? రోగి (పర్సు తడుముకుంటూ): హా... చాలా తేలిగ్గా అనిపిస్తోంది.
10
['tel']
మోడ్రన్ మదర్ అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మోడ్రన్ మదర్' అప్పుడే ప్రసవమై మెలకువ వచ్చిందామెకు. పక్కన తడిమి చూసుకుంది. ఆదుర్దా పడింది. బాలింత బాధ అర్థం చేసుకున్న నర్సమ్మ ‘‘ఇదిగోండి మీ పాప ... మనసారా చూసుకోండి’’ చేతికందిస్తూ నవ్వింది. ‘‘నేను వెతుకుతోంది ... నా మొబైల్ ఫోన్’’ చెప్పింది బాలింతరాలు.
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్టేటస్ కోమా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్టేటస్ కోమా' ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన సుబ్బారావు, ఒక అమ్మాయి పెట్టిన పోస్టు చదివి కోమాలోకి వెళ్లాడు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే... ‘‘నాకు మగాళ్లంటే అసహ్యం. అందుకే ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను, నా పిల్లల్ని కూడా చేసుకోనివ్వను’’.
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వీక్ బాయ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వీక్ బాయ్' ‘‘టింకూ .. ‘వీక్’ అనే పదాన్ని ఇంగ్లీషులో పదిసార్లు రామయంటే రెండు సార్లే రాశావేం?’’ ‘‘నేను లెక్కల్లో కూడా వీకే మేడమ్’’
5
['tel']
ఓ కాకి ఫీలింగ్ అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఓ కాకి ఫీలింగ్' ‘‘వీళ్లెక్కడి మనుషులురా బాబూ... అన్నానికి వస్తే పాడు కాకి అని తమురుతారు... పిండానికి రాకపోతే బతిమిలాడతారు’’.
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సరికి సరి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సరికి సరి' ‘‘మా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచాం. తనకి వంట చేయడం రాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బావగారూ ...’’ వియ్యంకుడి చేతులు పట్టుకున్నాడు దయానందరావు. ‘‘అయ్యో .. ఎంతమాట బావగారూ .. తప్పకుండా. అన్నట్టు మా అబ్బాయిని కూడా అల్లారుముద్దుగా పెంచాం. సంపాదించడం రాదు. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి’’ బదులిచ్చాడు వియ్యంకుడు.
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చెప్పకనే చెప్పడం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చెప్పకనే చెప్పడం' ‘‘ఊరికే ఆరోగ్యం గురించి వర్రీ కాకండి. మీకు ఢోకా లేదు. తొంభై ఏళ్లు బతుకుతారు’’ చెప్పాడు డాక్టర్. ‘‘డాక్టర్, ఆల్రెడీ నా వయసు తొంభై’’ బేలగా చూశాడు పేషెంటు. ‘‘చూశారా .. ఎంత కరెక్టుగా చెప్పానో’’ గర్వంగా చెప్పాడు డాక్టర్.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మరి ఆ రోజుల్లో... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మరి ఆ రోజుల్లో...' ఆ రోజుల్లో అమ్మమ్మ గారింట్లో పుట్టేవాళ్లం... పండుగలకూ, జాతరలకూ తరుచూ అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్లం. మరి ఇప్పుడో... ఆసుపత్రిలో పుడుతున్నాం... ఎప్పుడూ వాటి చుట్టూ తిరుగుతున్నాం.
8
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వద్దన్నా వస్తారు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వద్దన్నా వస్తారు' ‘‘స్వామీ నేను పోయిన తర్వాత నా సమాధి చుట్టూతా జనాలు గుమిగూడాలంటే ఏం చేయాలి ..’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఏముంది నాయనా .. నీ సమాధి దగ్గర ఫ్రీ వైఫై సౌకర్యం కలిగిస్తే చాలు. రాత్రింబవళ్లూ నీ సమాధి చుట్టే ఉంటారు’’ సెలవిచ్చాడు స్వామీజీ.
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రెండాకులు ఎక్కువే... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రెండాకులు ఎక్కువే...' ‘‘విడాకులు ఎందుకు కోరుకుంటున్నావ్?’’ అడిగాడు జడ్జి ‘‘నా భార్య నాతో వెల్లుల్లి ఒలిపిస్తుంది. ఉల్లిపాయలు కోయిస్తుంది. అంట్లు తోమిస్తుంది, బట్టలు ఉతికిస్తుంది ...’’ చెప్పాడు బుల్లెబ్బాయ్. ‘‘వీటితో అంత కష్టం ఏముంది? వెల్లుల్లిని వేడి నీటిలో వేస్తే పొట్టు సులువుగా వస్తుంది. ఉల్లిని గంటపాటు ఫ్రిజ్లో ఉంచితే కళ్లు నీరు కారవు. అంట్లు తోమే ముందు కొద్దిసేపు నానబెడితే సులువుగా శుభ్రపడతాయి, బట్టలు ఉతికే ముందు సర్ఫ్ నీటిలో నానబెడితే మురికి వదులుతుంది ..’’ బోధించాడు జడ్జి. ‘‘అర్థమయ్యింది’’ తల గోక్కున్నాడు బుల్లెబ్బాయ్. ‘‘ఏమర్థమయ్యింది?’’ అడిగాడు జడ్జి. ‘‘మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉందని’’ చెప్పాడు బుల్లెబ్బాయ్.
7
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఔరా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఔరా!' ‘అన్ని సబ్జెక్టులూ ఒకే మాస్టారు చెప్పలేడు కానీ, అన్ని సబ్జెక్టులూ ఒకే స్టూడెంట్ ఎలా నేర్చుకోగలడు!?’
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్టూడెంట్ నెం.1 ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్టూడెంట్ నెం.1' ‘‘ఏడాదిలో మొత్తం ఎన్ని రాత్రులు?’’ అడిగింది టీచర్. ‘‘పది టీచర్’’ చెప్పాడు రాజు. ‘‘ఎలా?’’ ఆశ్చర్యపోయింది టీచర్ ‘‘తొమ్మిది నవరాత్రులు, ఒక శివరాత్రి. మొత్తం పది టీచర్’’ వివరించాడు రాజు.
11
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ సంగతి!' టూరుకెళ్లిన ఆడవాళ్ల బస్సు దురదృష్టవశాత్తు నదిలో పడి అందరూ పోయారు. భర్తలందరూ వారం రోజుల పాటు ఏడ్చి ఏడ్చి చాలించారు గాని, శేషావతారం మాత్రం ఏడుపు ఆపడం లేదు. ‘‘భార్యను బాగా మిస్సవు తున్నారా ..’’ జాలిగా అడిగాడు శేషావతారం శ్రేయోభిలాషి. ‘‘లేదు. ఆ రోజు నా భార్య బస్సు మిస్సయ్యింది’’ మళ్లీ గొల్లుమన్నాడు శేషావతారం.
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రివర్స్ గేర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రివర్స్ గేర్' ‘‘పనిమనిషి వస్తుంది కదా .. ఇల్లు నువ్వు ఊడుస్తున్నావేం?’’ అడిగాడు అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్త. ‘‘అది వచ్చిందంటే .. ఇల్లంతా మట్టి మట్టిగా ఉందని ఒకటే గొడవ చేస్తుంది. అందుకే ఊడుస్తున్నా ...’’ బదులిచ్చింది భార్య.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భలే మొగుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భలే మొగుడు' అప్పటిదాకా ఊరిమీద బలాదూర్ తిరిగొచ్చిన శ్యామలరావు భార్యతో ‘‘కాంతం, ఈ రోజు లంచ్లోకి ఏంటి?’’ అడిగాడు విలాసంగా. ఆ మాటకి బట్టలు ఉతుకుతున్న కాంతానికి కోపం నషాళానికి అంటింది. తమాయించుకుని ‘‘ఇవాల్టికి నేను ఊరు వెళ్లాననుకుని మీరే వండుకోండి’’ అంది. లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి దూరి కడుపునిండా వండుకు తిని బయటకి వస్తుంటే .. ‘‘నాకేదీ...’’ అడిగింది కాంతం. ‘‘నువ్వు ఊరునుండి ఎప్పుడొచ్చావ్ కాంతం?’’ అమాయకంగా ప్రశ్నించాడు శ్యామల్రావు.
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సొంత వైద్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సొంత వైద్యం' ‘‘నా బాడీలో ఐరన్ లేదు డాక్టర్. ఐరన్ టాబ్లెట్లు రాయండి.’’ ‘‘నీ బాడీలో ఐరన్ లేదా ... రక్త పరీక్ష చేయించావా?’’ ‘‘బాడీకి అయస్కాంతం పెట్టి చూశా. అతుక్కోలేదు ...’’ ‘‘ .....!?’’
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ రెండు మాటలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆ రెండు మాటలు' ‘‘స్వామీ, మీరు సన్యాసిగా ఎలా మారారు?’’ అడిగాడు శిష్యుడు. ‘‘గతంలో చీరల షాపులో పనిచేసేవాడ్ని. అక్కడికి వచ్చే ఆడవాళ్లు మాట్లాడిన రెండు మాటలకి జీవితంపై విరక్తి కలిగి ఇలా మారాను’’ చెప్పాడు స్వామీజీ. ‘‘ఏం మాట్లాడేవారు స్వామీ వాళ్లు?’’ ఆసక్తిగా అడిగాడు శిష్యుడు. ‘‘1 - ఈ డిజైన్లో వేరే కలర్ చూపించు. 2 - ఈ కలర్లో వేరే డిజైన్ చూపించు ..’’ అర్ధనిమీలిత నేత్రాలతో సెలవిచ్చాడు స్వామీజీ.
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆరోహణ క్రమం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆరోహణ క్రమం' ఒక స్కూల్లో గ్రూప్ ఫోటో తీయడానికి ఫొటో గ్రాఫర్ని పిలిచారు. ఫొటోగ్రాఫర్ ఒక్కొక్కరికి రూ.20 అవుతుందన్నాడు. హెడ్ మాస్టర్ పిల్లలు చాలా బీదవారని చెప్పి రూ.10 ఇస్తారని ఒప్పించాడు. ఫొటోగ్రాఫర్ సరేనన్నాడు. హెడ్మాస్టర్ టీచర్లని పిలిచి ‘‘ఒక్కొక్క విద్యార్థి దగ్గర రూ.30 వసూలు చేయమని చెప్పాడు. టీచర్లు పిల్లలతో ఒక్కొక్కరూ రూ. 50 తీసుకురావాలని ఆర్డరేశారు. పిల్లలు వాళ్ల వాళ్ల అమ్మల దగ్గరకు వెళ్లి స్కూల్లో ఫోటోకి రూ.100 అడిగారని చెప్పారు. అమ్మేమో నాన్న దగ్గరకు వెళ్లి పిల్లల గ్రూప్ ఫోటోకి స్కూల్లో రూ.200 అడిగారని చెప్పి వసూలు చేసింది.
5
['tel']
అన్నీ మంచి శకునములే... అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అన్నీ మంచి శకునములే...' ఐసీయూలో ఉన్న జోగినాథానికి దినపత్రిక ఇచ్చారు సిబ్బంది. గబగబా పేజీలు తిప్పి రాశిఫలం చూసుకున్నాడు. ‘‘ఈరోజు మీకు శుభదినం. సుదూర ప్రయాణం. ఖర్చు తక్కువ. పాత మిత్రులను, బంధువులను కలుస్తారు. ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు ... శుభం!’’
1
['tel']
డైమండ్ రాణి అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'డైమండ్ రాణి' ‘‘నిన్న నా శ్రీమతి పుట్టినరోజు జరుపుకుంది’’ చెప్పాడు పీతాంబరం. ‘‘అలాగా .. మరి గిఫ్ట్ ఏమిచ్చావ్?’’ అడిగాడు ఏకాంబరం. ‘‘ఏం కావాలో కోరుకోమంటే, మీరేదైనా కొనివ్వండి కాని అందులో డైమండ్ తప్పనిసరిగా ఉండాలంది’’ వివరించాడు పీతాంబరం. ‘‘అవును మరి, శ్రీమతా మజాకా .. ఇంతకీ ఏం కొనిచ్చావు?’’ ఉత్సాహంగా రెట్టించాడు ఏకాంబరం. ‘‘ప్లేయింగ్ కార్డ్స్’’ తాపీగా బదులిచ్చాడు పీతాంబరం.
2
['tel']
తెలుగుబాబు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'తెలుగుబాబు' అటుగా వెళ్తున్న జోగినాథానికి స్కూల్ గేటు ముందు బెంచీపైన ఒక పిల్లాడు దీనంగా కూర్చుని ఉండడం కనిపించింది. ‘‘ఏం బాబూ .. నిన్ను తీసుకెళ్లడానికి మీ అమ్మా రాలేదా?’’ అడిగాడు జోగినాథం. ‘‘నాకు అమ్మ లేదు’’ చెప్పాడు బాబు. ‘‘నాన్న వస్తారా మరి?’’ బాధపడ్డాడు జోగినాథం. ‘‘నాకు నాన్న లేడు’’ చెప్పాడు బాబు. ‘‘మరి ఎవరొస్తారు?’’ జాలిగా అడిగాడు జోగినాథం. ‘‘మమ్మీడాడీల్లో ఎవరో ఒకరొస్తారు’’ తాపీగా చెప్పాడు పిల్లాడు.
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దాచాలన్నా దాచలేవు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దాచాలన్నా దాచలేవు' సుందరికి సర్జరీ జరుగుతోంది. ‘‘మీ వయసు ఎంత?’’ డాక్టర్. ‘‘22’’ చెప్పింది సుందరి. ‘‘నిజం చెప్పండి. మీ వయసుని బట్టి మత్తు ఇవ్వాల్సి ఉంటుంది’’ అనుమానంగా అడిగాడు డాక్టర్. ‘‘32’’ పదేళ్లు పెంచింది సుందరి. ‘‘వయసు తేడా చెబితే, మత్తు పనిచెయ్యదు. సర్జరీ మధ్యలోనే మెలుకువ రావచ్చు. అది మరీ ప్రమాదం’’ ఇంకా నమ్మలేదు డాక్టర్. ‘‘46’’ నమ్మకంగా చెప్పింది సుందరి. నమ్మాడు డాక్టర్.
14
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నీకు సంబంధం లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నీకు సంబంధం లేదు' తాగుబోతు తాతారావు ఉదయం నిద్ర లేవగానే గతరాత్రి భార్యతో జరిగిన గొడవ గుర్తుకొచ్చి బాధపడ్డాడు. తాగి పడేసిన బీరు సీసాలను చూస్తూ... ‘‘ఛీ, ఈ గొడవకంతటికీ మీరే కారణం’’ అని వరసగా ఒక్కో సీసా పగలగొట్టసాగాడు. చివరి సీసా పైకెత్తబోయి ఆగాడు. అది బరువుగా ఉంది. సీల్ కూడా తీయలేదు. ‘‘రాత్రి జరిగిన గొడవకూ, నీకూ సంబంధం లేదు’’ అంటూ తీసుకెళ్లి జాగ్రత్తగా అలమరాలో దాచాడు.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దూరబాకురోయ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దూరబాకురోయ్!' చూడు తమ్ముడూ ... భార్యాభర్తలు ఒకే కత్తెరలోని రెండు భాగాలు. అవెప్పుడూ కలిసే ఉంటాయి. మధ్యలో వెళ్లినవాడికే పీక తెగిపోద్ది!
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పానీపూరి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పానీపూరి' ఎంతటి కోటీశ్వరుడి కైనా చేతిలో చిప్ప పెట్టి, వరుసలో నిల్చోబెట్టగల సామర్థ్యం ఒక్క పానీపూరి బండివాడికే ఉంది.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎంబ్రాయిడరీ డాక్టర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎంబ్రాయిడరీ డాక్టర్' ‘‘ఆపరేషన చేశాక నా పొట్టమీది కుట్లన్నీ పువ్వుల్లా కనిపిస్తున్నాయి’’ గాబరాగా అడిగాడు చంచల్రావు. ‘‘అదా .. నీకు ఆపరేషన చేసిన మా లేడీ డాక్టర్కి ఎంబ్రాయిడరీ చేయడం చాలా ఇష్టం ..’’ తాపీగా చెప్పింది నర్సు.
8
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మీరే కొనిస్తారనుకున్నా ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మీరే కొనిస్తారనుకున్నా ...' ‘‘దేవుడా .. నాకు లాటరీ తగిలేలా చెయ్యి’’ మొక్కాడు వీరబాబు. వరసగా పది రోజులు ఇదే మాదిరి మొరపెట్టుకున్నాడు వీరబాబు. పదకొండో రోజు కూడా దేవుడ్ని ప్రార్థించబోయేసరికి, ‘‘మూర్ఖుడా, ముందు వెళ్లి లాటరీ టికెట్టు కొనుక్కో’’ అనే మాటలు వినిపించాయి గాల్లోంచి.
6
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎవరి ప్రాబ్లం వారిది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరి ప్రాబ్లం వారిది' ‘‘నువ్వెందుకు ఆర్మీలో చేరావు?’’ ‘‘నాకు భార్య లేదు. యుద్ధం అంటే ఇష్టం. మరి నువ్వెందుకు చేరావు?’’ ‘‘నాకు భార్య ఉంది. శాంతి అంటే ఇష్టం’’
11
['tel']
అసలు సంగతి అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అసలు సంగతి' ‘‘నదులన్నిటికీ ఆడపేర్లూ, కొండలన్నిటికీ మగపేర్లూ ఉంటాయెందుకు?’’ అడిగాడు శేషు. ‘‘నదులు ఒక చోట కుదురుగా ఉండవు కాబట్టి, కొండలు కూర్చున్న చోటు నుండి కదలవు కాబట్టి’’ చెప్పాడు బోసు.
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ టక్కరి కుక్క ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'టక్కరి కుక్క' ‘‘మా కుక్క చాలా తెలివైంది తెలుసా?’’ ‘‘ఏంటో ఆ తెలివి?’’ ‘‘పొద్దున్నే నాకు పేపరు తెచ్చి ఇస్తుంది’’ ‘‘విశేషమేముంది. అన్ని కుక్కలూ చేసే పనే’’ ‘‘కానీ, మేం పేపరు వేయించుకోంగా ...’’
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక భార్యల రియాల్టీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భార్యల రియాల్టీ' పైలెట్ భార్య : నా దగ్గర మరీ అంతలా ఎగరకండి. డాక్టర్ భార్య : మీ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. టీచర్ భార్య : నాకేం క్లాసు పీకక్కర్లేదు. జడ్జి భార్య : ఇది చెప్పడానికి వాయిదాలెందుకు? న్యాయవాది భార్య : ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటది. యాక్టర్ భార్య : ఈ మాత్రం నటన మాకూ వచ్చు. ఇంజనీర్ భార్య : ప్లాను వేయడం మాకూ తెలుసు. సాఫ్ట్వేర్ భార్య : మీ ఆఫీసులో ఉన్న యాంటీ వైరస్కి ఏ సాఫ్ట్వేర్ వాడాలో నాకు బాగా తెలుసు. పొలిటీషియన్ భార్య : మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మానాన్నలతో అత్యవసర సమావేశం పెట్టించి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా.
7
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పెళ్లిరోజు కానుక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పెళ్లిరోజు కానుక' ‘‘ఈసారి మన పెళ్లి యానివర్సరీకి నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు?’’ గోముగా అడిగింది రోజీ. ‘‘ఆఫ్రికా ...’’ చెప్పాడు బుజ్జిబాబు. ‘‘ఓ... వండర్, మరి వచ్చే ఏడాది యానివర్సరీకి?’’ కొంటెగా అడిగింది రోజీ. ‘‘నిన్ను ఆఫ్రికానుండి వెనక్కి తీసుకొస్తాను’’ తాపీగా చెప్పాడు బుజ్జిబాబు.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎందుకు చంపాడో తెలిసిందా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎందుకు చంపాడో తెలిసిందా?' ఇంటి ముందు పార్క్ చేసిన కారు పోవడంతో పోలీసు కంప్లెంట్ ఇచ్చాడు పర్వతాలు. 24 గంటల తర్వాత యధాస్థానంలో తన కారు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. పైగా అందులో ఒక ఆకాశరామన్న ఉత్తరం కూడా ఉంది. ‘‘సార్, నన్ను క్షమించండి. నేను ఒక కారు మెకానిక్ని. కావాలని మీ కారు దొంగతనం చేయలేదు. మా అమ్మకు సుస్తీ చేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సమయానికి వెహికిల్ దొరకక తప్పని సరి పరిస్థితుల్లో దొంగిలించాను. పెట్రోలు కూడా పోయించాను. కృతజ్ఞతగా ఈ రోజు సెకండ్ షోకి మీ ఇంటిల్లిపాది వెళ్లడానికి బాహుబలి - 2 సినిమా టికెట్లు జత చేస్తున్నాను. సినిమా చూసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోండి.’’ దొంగ నిజాయితీకి పర్వతాలు మనసు కరిగి పోలీస్ కంప్లెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అంతా కలిసి సినిమాకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యింది. బీరువాలో ఒక చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది. ‘‘ఇప్పుడు అర్థమయ్యిందా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో?’’
12
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ సంగతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ సంగతి' ‘‘ఈ రోజు పాఠం బుద్ధిమంతుడిలా వింటున్నావు..’’ మెచ్చుకుంది టీచర్. ‘‘ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది టీచర్’’ అబద్ధం చెప్పలేకపోయాడు రాజేష్.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చూడు తమ్ముడూ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చూడు తమ్ముడూ...' ఈ ప్రపంచంలో పిరికివాడు సైతం చేయగల సాహస కార్యం పెళ్లిచేసుకోవడం! అడగ్గానే ఇచ్చేవారి దగ్గర అప్పు తీసుకోరాదు. మనం ఇచ్చేవరకు అడగనివారి దగ్గర మాత్రమే తీసుకోవాలి.
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అంతే తేడా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతే తేడా!' ‘‘ఈజిప్టు మమ్మీలకు, నిజం మమ్మీలకు తేడా ఏంటి డాడీ?’’ అడిగింది పుత్రిక. ‘‘ఈజిప్టు మమ్మీలకు పిల్లలు భయపడతారు. నిజం మమ్మీలకు డాడీలు భయపడతారమ్మా’’ చెప్పాడు జనకుడు.
10
['tel']
అంతా మనమంచికే! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అంతా మనమంచికే!' ‘‘రేయ్ బంగారం, నేను ఫెయిలైతే మానాన్న రిక్షావాడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడురా’’ ఏడ్చింది ప్రియురాలు. ‘‘వర్రీకాకు బంగారం, నేను ఫెయిలైతే మా నాన్న రిక్షా కొనిస్తానన్నాడు’’ ఓదార్చాడు ప్రియుడు. అదీ సంగతి ‘‘ఈ రోజు పాఠం బుద్ధిమంతుడిలా వింటున్నావు..’’ మెచ్చుకుంది టీచర్. ‘‘ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది టీచర్’’ అబద్ధం చెప్పలేకపోయాడు రాజేష్.
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఓడ్కా సూక్తి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఓడ్కా సూక్తి' నన్ను నమ్ముకో .. నువ్వు తప్పక డాన్స్ చేయగలవు!
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అతికిస్తారా? అంటిస్తారా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అతికిస్తారా? అంటిస్తారా?' ‘‘కాగితాలు అంటించాలి. జిగురు తీసుకురా ..’’ చెప్పాడు తండ్రి. అగ్గిపెట్టె తెచ్చాడు సుపుత్రుడు. ‘‘జిగురు తెమ్మంటే, అగ్గిపెట్టె తెచ్చావేం?’’ కోప్పడ్డాడు తండ్రి. ‘‘జిగురుతో ఎలా అంటిస్తారు?’’ బుర్ర గోక్కున్నాడు సుపుత్రుడు.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ ముగ్గురూ నేనేనట! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆ ముగ్గురూ నేనేనట!' ‘‘మమ్మీ! రవితేజ, మహేష్బాబు, అల్లు అర్జున్, నేనూ ... ఒకటే అంది మా టీచర్’’ గొప్పగా చెప్పాడు బుల్లెబ్బాయ్. ‘‘నిజమా ... ’’ ఆశ్చర్యపోయింది సుమిత్ర. ‘‘అవును. నాలో ఒక ఇడియట్, ఒక పోకిరి, ఒక దేశముదురు ఉన్నారంది’’ అసలు విషయం చెప్పాడు బుల్లెబ్బాయ్.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రవాణా మార్గం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రవాణా మార్గం' ‘‘గంట నుండి మీతో మాట్లాడుతుంటే కాలమే తెలియలేదు. నా తలనెప్పి అంతా పోయింది’’ సంతోషంగా చెప్పాడు శంభులింగం. ‘‘అయితే, ఇప్పుడు నాకొచ్చిన తలనెప్పి నీదేనన్నమాట’’ నొసలు చిట్లించాడు రామలింగం.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నా డ్యూటీ తనే చేస్తాడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నా డ్యూటీ తనే చేస్తాడు' ‘‘నేను రాత్రుళ్లు కాపలా కాయను. సుబ్బరంగా నిద్దరోతా’’ చెప్పింది మొదటి కుక్క. ‘‘ఎందుకూ ...?’’ అడిగింది రెండో కుక్క. ‘‘మా యజమానికి నిద్దట్లో అరిచే అలవాటుంది’’ చెప్పింది మొదటి కుక్క.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బిజినెస్ కిటుకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బిజినెస్ కిటుకు' ‘‘ఎప్పుడూ ఈసురోమని ఉండే నీ హాస్పటల్ ఈ మధ్య పేషెంట్లతో కళకళలాతోంది .. ఏమిటి సంగతి?’’ అడిగాడు మిత్రుడు వీరలింగం. ‘‘పదిమంది అందమైన నర్సులను ఈ మధ్యనే అప్పాయింట్ చేశానోయ్’’ నిజాయితీగా చెప్పాడు సోమలింగం.
12
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సరైనోడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సరైనోడు' ‘‘నెమ్మదిగా నడిపే డ్రైవరు కావాలన్నావు కదా .. ఇదిగో తీసుకొచ్చాను’’ చెప్పాడు మిత్రుడు సుబ్బారావు.‘‘థాంక్యూ రా .. గతంలో ఏ వెహికిల్ నడిపేవాడివోయ్?’’ అడిగాడు అప్పారావు డ్రైవరు వంక చూస్తూ.‘‘రోడ్ రోలరండి’’ చెప్పాడు కొత్త డ్రైవరు.
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సరే గురువుగారూ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సరే గురువుగారూ' ‘‘కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా’’ బోధించాడు గురువు.‘‘అలాగేనండి’’ - కట్టుకున్న లుంగీని, విప్పిన తర్వాత మడతపెట్టి బీరువాలో దాచాడు శిష్యుడు.
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఫలించనున్న జోస్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఫలించనున్న జోస్యం' ‘‘నేనొకవేళ చనిపోతే ..’’ దగ్గుతూ పొలమారాడు రోగిష్టి జోగినాథం.‘‘అంతమాటనకండి .. నేనూ మీతో పాటే ..’’ అంది ఆండాళ్లు కళ్లొత్తుకుంటూ.‘‘బతికున్నా, చచ్చినా దురదృష్టం నీ వెంటే ఉంటుందని జ్యోతిష్కుడు ఎప్పుడో చెప్పాడు’’ నీరసంగా పలికాడు జోగినాథం.
4
['tel']
అది మాత్రం కుదరదు! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అది మాత్రం కుదరదు!' తల్లితో ప్రేమగా మాట్లాడాలి.తండ్రిదో మర్యాదగా మాట్లాడాలి.అన్నదమ్ములతో అభిమానంగా మాట్లాడాలి.గురువులతో గౌరవంగా మాట్లాడాలి.మిత్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి.బామ్మర్దులతో కాస్త వెటకారంగా మాట్లాడాలి.భార్యతో ....అంత సీన్ లేదు - ఆవిడ చెప్పింది వినాలి.
1
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మర్చిపోలేని రూపం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మర్చిపోలేని రూపం' ‘‘ఎటు వైపు చూసినా నీ మొహమే కనిపిస్తోంది రాజా ...’’ ఫోన్లో చెప్పింది నీలవేణి.‘‘అంటే నీ మనసులో నేనున్నానన్నమాట. లవ్ యూ డియర్ ... ఇంతకీ ఎక్కడున్నావు’’ గోముగా అడిగాడు రాజా.‘‘జూలో .. డియర్’’ అంతే గోముగా చెప్పింది నీలవేణి
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రివర్స్లో చూపించు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రివర్స్లో చూపించు' ‘‘ఈ సోఫా చూడండి. పగలు సోఫాలా, రాత్రి మంచంలా ఉపయోగపడుతుంది’’ చెప్పాడు సేల్స్మ్యాన్.‘‘అబ్బే .. లాభం లేదు. రాత్రి సోఫాలా, పగలు మంచంలా ఉండేది చూపించు’’ ఆవులిస్తూ చెప్పాడు శేషావతారం.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అంతే మరి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతే మరి..' టీచర్:ఈజిప్ట్ మమ్మీకి, ఇండియన్ మమ్మీకి తేడా ఏంటి..?స్టూడెంట్:ఈజిప్ట్ మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కొంప కొల్లేరయ్యింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొంప కొల్లేరయ్యింది' ‘‘ఒరేయ్ పండూ, రిజల్ట్స్ వచ్చాయట. వెళ్లి చూసుకుందాం రా’’ ‘‘నేనిప్పుడు రాలేను. మా డాడీతో పనిమీద వెళ్తున్నాను. నువ్వే నా రిజల్ట్ చూడు. ఒక సబ్జెక్ట్ పోతే గుడ్మార్నింగ్ అని, రెండు సబ్జెక్ట్సు పోతే గుడ్మార్నింగ్ టు యు అండ్ యువర్ డాడీ అని పంపించు’’ గంట సేపు తర్వాత పండుకు మెసేజ్ వచ్చింది. ‘‘గుడ్మార్నింగ్ టు యు అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ’’.
12
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదే ఫీలింగ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదే ఫీలింగ్' బ్యాంక్ మేనేజర్ ఒక హోటల్కి వెళ్లాడు. సర్వర్ : సర్ ఆర్డర్ ప్లీజ్! బ్యా.మే. : మీ దగ్గర ఏముంటాయి? సర్వర్ : ఇడ్లీ, వడ, ఊతప్పం, ఉప్మా, పొంగల్ దోశ, పూరీ.... బ్యా.మే. : (ఆపమన్నట్టు చెయ్యి ఎత్తి) ఓకే... ఓకే... ఇడ్లీ, వడ, దోశ పట్టుకురా. ఊతప్పం రెండు ప్లేట్లు పార్శిల్ కట్టించు. సర్వర్ : సారీ సర్, అవేమీ లేవు. అమ్ముడైపోయాయి. బ్యా.మే. : (చిరాగ్గా) ఈ మాత్రం దానికి ఎందుకు అంత పెద్ద దండకం చదివావు? సర్వర్ : మరి, మేం మీ ఏటీఎంకు వెళితే అది ముందు పిన్ నంబర్ అడుగుతుంది. ఎక్కౌంట్ డిటెయిల్స్ అడుగుతుంది. ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రింట్ కావాలా, వద్దా? అని అడుగుతుంది. అన్నీ చేశాక, చివర్లో ‘నో క్యాష్’ అని నింపాదిగా చెబుతుంది కదా! అందుకన్న మాట.
9
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ సుఖమే నే కోరుకున్నా ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆ సుఖమే నే కోరుకున్నా ...' ‘‘సార్, కొత్తగా వచ్చిన క్లర్క్ కుమారి పొద్దస్తమానం పక్కసీట్లో ఉన్న కనకారావు భుజంపై ఒరిగిపోతోంది’’ ఫిర్యాదు చేశాడు ఆఫీసు బాయ్. ‘‘అలాగా .. అయితే రేపట్నించి నా కుర్చీ తీసుకెళ్లి ఆ కనకారావు ప్ల్లేస్లో వేయ్’’ ఆర్డర్ జారీ చేశాడు మేనేజర్.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చెప్పినందుకే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చెప్పినందుకే ...' ‘‘ఏంటి .. నీ ప్రియురాలు నిన్ను వదిలేసిందా?’’ ‘‘అవును ...’’ ‘‘నీ మేనమామ కోటీశ్వరుడని చెప్పలేక పోయావా?’’ ‘‘చెప్పాను. అందుకే తను ఇప్పుడు నాకు అత్త కాబోతోంది.’’
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఉండే కాలం వస్తే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉండే కాలం వస్తే ...' ఓ ఎమ్మెల్యే పిచ్చాసుపత్రి విజిట్ చేశాడు. ఆయన్ని చూడగానే పిచ్చోళ్లంతా దూరంగా జరిగారు. ఒక పిచ్చోడు మాత్రం లెక్కలేనట్టు దర్జాగా నిల్చున్నాడు. ‘‘నేనెవరో తెలుసా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని’’ అన్నాడు ఎమ్మెల్యే. ‘‘ఆర్నెల్ల క్రితం నేను కూడా ఇలాగే అన్నాను. అప్పట్నించి నన్ను ఇక్కడే ఉంచేశారు’’ చెప్పాడు పిచ్చోడు.
7
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ‘చావు’ తెలివి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘చావు’ తెలివి!' ఓ మహిళ ... పేరున్న చిత్రకారుడి దగ్గరికెళ్లి తన బొమ్మ గీసిపెట్టమని అడిగింది. ‘దయచేసి ఆ బొమ్మలో నేను ఓ రవ్వల నెక్లెస్ వేసుకున్నట్టు ఉండాలి’ అని షరతు పెట్టింది.‘ఎందుకు మేడమ్’ అమాయకంగా అడిగాడు ఆర్టిస్టు.‘పొరపాటున నేను చచ్చిపోయాననుకో. మా ఆయన తప్పకుండా రెండోపెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే ఆవిడ ఈ బొమ్మను చూసి తీరుతుంది. ఈ నెక్లెస్ కోసం బీరువా అంతా గాలిస్తుంది. ఎక్కడా కనబడదు. దీంతో మా ఆయన ఆఫీసు నుంచి రాగానే గొడవపెట్టుకుంటుంది. మాటా మాటా అనుకుంటారు. ఇక అప్పటి నుంచీ రోజూ గొడవే...’ కళ్లకు కట్టినట్టు జరగబోయేదంతా వివరించింది మహిళ.‘ఈ ఐడియా ఎలా వచ్చింది మేడమ్’ ఆరాధనగా అడిగాడు చిత్రకారుడు.‘జీవన్ ఆనంద్ పాలసీ గురించి విన్లేదా....జిందగీకే సాత్ భీ, జిందగీకే బాద్ భీ! మా ఆయన ఇన్సురెన్సు ఉద్యోగి’ - జవాబిచ్చింది మహిళ.
14
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ద్యే...వు....డా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ద్యే...వు....డా!' ఓ పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇరవై అయిదో అంతస్తు మీద సూపర్వైజరు ఉన్నాడు. కింద కార్మికుడు ఉన్నాడు. పై నుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు. దీంతో, అలా అయినా, తలపైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో....జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు. కిందపడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ, పైకి చూడలేదు. ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు. అయినా స్పందన లేదు. దీంతో, ఓ చిన్న రాయి విసిరాడు. అది కాస్తా వెళ్లి నెత్తికి తగిలింది. అప్పుడు తలపైకెత్తాడు....ఈ కథంతా చెప్పిన స్వామీజీ ‘ఇందులో నీతి ఏమిటో తెలుసా?’ అని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. మళ్లీ తనే అందుకున్నాడు.‘వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం. కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం’
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒకే ప్రశ్న... మూడు జవాబులు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకే ప్రశ్న... మూడు జవాబులు' తమిళనాడు విద్యార్థులు ఒకే ప్రశ్నకు వివిధ పరీక్షల్లో వివిధ జవాబులు రాయాల్సి వచ్చింది. ఆ ప్రశ్న ... ‘తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు?’క్వార్టర్లీలో... ‘జె. జయలలిత’హాఫ్ ఇయర్లీలో... ‘పన్నీర్ సెల్వన్’యాన్యువల్ ఎగ్జామ్స్... ‘పళనిస్వామి’
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రామేశ్వరమెళ్లినా... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రామేశ్వరమెళ్లినా...' అంతకుముందు రోజు రాజీనామా లేఖ ఇచ్చివెళ్లిన ఉద్యోగి, హెచ్ఆర్ మేనేజరు క్యాబిన్లోకెళ్లి.... ‘సార్! నా నిర్ణయం మార్చుకుంటున్నా. చచ్చినా కొత్త ఉద్యోగంలో చేరను’ అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు.‘అంతలోనే ఏమైంది?’ అనుమానంగా అడిగాడు హెచ్ఆర్ హెడ్డు.‘మా బాసు కూడా రాజీనామా చేసి, ఆ కంపెనీకే వెళ్తున్నాడట. ఇప్పుడే తెలిసింది’ - జవాబిచ్చాడు ఉద్యోగి.
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బాబోయ్ ఎండలు.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బాబోయ్ ఎండలు..' సూర్యుడికి కూడా భార్య ఉంటేబావుంటుంది..కొంచెం కంట్రోల్లో ఉంటాడు..లేదంటే ఏంటిది.. ఇంతలా ఎండలు మండిస్తాడా..!
13
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వారు మేధావులవుతారా..! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వారు మేధావులవుతారా..!' దేశంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 943 మంది అమ్మాయిలే ఉన్నారట. (జెండర్ రేషియో).. అంటే దానర్థం 57 మంది అబ్బాయిలు అవివాహితులుగానే ఉండిపోతారు.ఆ 57 మంది పెరిగి పెద్దయ్యాక.. అబ్దుల్ కలాం, వాజ్పేయి, రతన్ టాటా, యోగి, నరేంద్ర మోదీ వంటి వారుగా తయారవుతారు..మిగిలిన 943 మంది.. కుక్కర్ 3 విజిల్స్ అయ్యాక గ్యాస్ ఆపుతూ ఉంటారు.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ‘అందమైన’ పురాణం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘అందమైన’ పురాణం' ఒక అష్టావధాని అవధానం చేస్తుండగా తెలివైన పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ఇది.దత్తపది...తమన్నా - సమంతా - త్రిష - కాజల్ అవధాని గారి పూరణ... భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో... తా తమన్నన బొందిన ధన్యుడివుదోసమంతగ నెంచడు - కాశి రాజపుత్రి షండునిగా మారి పుట్టిముంచెగంగ రప్పించు త్రాగుటకా జలమ్ముఇలా తేటగీతిలో‘అందమైన’పద్యం చెప్పి సభికుల్ని ఆనందంలో ముంచెత్తారు అవధాని గారు.
4
['tel']
గురి తప్పటం లేదు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'గురి తప్పటం లేదు' ‘‘మా ఆవిడ గత మూడేళ్లుగా చేతికి దొరికిన వస్తువులన్నీ నాపైకి విసురుతోంది సార్. నిన్న కత్తి కూడా విసిరింది. ఇదిగో గాటు ...’’ గొల్లుమన్నాడు ముకుందం.‘‘మూడేళ్లనుండి విసురుతుంటే ఇప్పుడెందుకు వచ్చావు?’’ అనుమానం వ్యక్తపరచాడు ఎస్.ఐ.‘‘మొన్నటి వరకు గురి తప్పేది’’ చెప్పాడు ముకుందం.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పోకచెక్క బతుకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పోకచెక్క బతుకు' ‘‘ఏ అమ్మాయిని తీసుకెళ్లినా మా మమ్మీకి నచ్చట్లేదు .. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు’’ వాపోయాడు అనిల్.‘‘వెరీ సింపుల్. మీ మమ్మీకి ఇష్టమైన అమ్మాయినే తీసుకెళ్లు’’ సలహా ఇచ్చాడు సునీల్.‘‘తీసుకెళ్లాను ... కాని, ఆ అమ్మాయిని డాడీ ఇష్టపడటం లేదు ...’’ గొల్లుమన్నాడు అనిల్.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ జెలసీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జెలసీ' ‘‘అదిగో .. అతనే ...’’ ఒక తాగుబోతును చూపిస్తూ గుసగుసగా అంది సునీత.‘‘ఎవరతను?’’ నుదురు చిట్లిస్తూ అడిగాడు భర్త వీరేంద్ర.‘‘మన పెళ్లికి ముందు నేను విడాకులిచ్చింది ఆయనకే’’ చెప్పింది సునీత.‘‘అందుకేనా .. ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు’’ కుళ్లుగా అన్నాడు వీరేంద్ర.
11
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కుదర్లేదులే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కుదర్లేదులే' పొద్దున్నే భర్తను నిద్రలేపి కాఫీ పెట్టిమ్మంది నాంచారి.‘‘ఇక నావల్ల కాదు’’ అంటూ కోపంగా చెప్పులేసుకున్నాడు జోగినాథం.‘‘ఎక్కడికెళ్తున్నారు?’’ అడిగింది నాంచారి.‘‘లాయర్ దగ్గరకి. నీకు విడాకులిచ్చేస్తాను ’’ చెప్పాడు జోగినాథం.గంట తర్వాత పిల్లిలా వచ్చి కిచెన్లో దూరి కాఫీ చేసి భార్యకిచ్చాడు.‘‘ఏమైంది? విడాకులిస్తానన్నారుగా’’ కాఫీ సిప్ చేస్తూ అంది నాంచారి.‘‘నేను వెళ్లేసరికి లాయర్ అంట్లు తోముతున్నాడు’’ గొణిగాడు జోగినాథం.
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పులికి ఆకలేసింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పులికి ఆకలేసింది' ‘‘సోమూ .. పులి, మేక బొమ్మల్ని వేసుకురమ్మని హోమ్వర్క్ ఇచ్చాను కదా .. మేక బొమ్మ వేయలేదేం?’’ అడిగింది టీచర్.‘‘రెండూ వేశాను టీచర్. పులికి ఆకలేసిందేమో, మేకను తినేసినట్టుంది’’ గడుసుగా బదులిచ్చాడు సోము.
5
['tel']
అయ్య కొడుకు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అయ్య కొడుకు' ‘‘నాన్నా .. మా లెక్కల సారు నిన్ను రేపు స్కూల్లో కలవమని చెప్పాడు’’ బుజ్జి.‘‘ఏమయిందిరా ..?’’ నాన్న.‘‘ఈరోజు క్లాసులో 6 ్ఠ 6 ఎంత అన్నాడు. 36 అని చెప్పాను. తర్వాత 4 ్ఠ 9 ఎంత అన్నాడు ... ’’ బుజ్జి‘‘వెధవా .. రెండూ ఒకటే కదరా ..’’ నాన్న.‘‘నేనూ అదే చెప్పాను’’ బుజ్జి.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అంతా ఆవిడ దయ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతా ఆవిడ దయ!' మనం తినే ప్రతి మెతుకుపై మన పేరు రాస్తాడు భగవంతుడు.కానీ ఆ మెతుకు బిర్యానీ మెతుకా, చద్దన్నం మెతుకా అనేది భార్య నిర్ణయిస్తుంది.అందుకే తగలబెడుతున్నాం!రావణుడి బొమ్మ తగలబెట్టడానికి వచ్చిన ప్రజలకు బొమ్మలో నుండి రావణుడి గొంతు వినిపించింది -‘నన్నెందుకు కాలుస్తారు. నేను మీ భార్యలనేమైనా ఎత్తుకెళ్లానా?’ఇంతలో గుంపులో నుండి ఎవరో సమాధానమిచ్చారు.‘లేదు. అందుకే తగలబెడుతున్నాం’
5
['tel']