inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కొట్టాడు దెబ్బ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొట్టాడు దెబ్బ!' ‘‘ఈ మార్కులేంట్రా... నూటికి రెండా .. సిగ్గు సిగ్గు’’ ఆశ్చర్యపోయాడు వాస్తు శిల్పి వామనశాస్త్రి. ‘‘మా స్కూలుకు వాస్తు బాగోలేదట నాన్నా’’ చెప్పాడు పుత్రరత్నం.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మార్చాల్సి వచ్చింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మార్చాల్సి వచ్చింది' ‘‘మీ ఆవిడ పేరు గున్నమ్మ కదా ... గూగులమ్మా అని పిలుస్తున్నారేం?’’ ఆశ్చర్యపోయాడు చిత్తరంజన్. ‘‘అసలు పేరు గున్నమ్మే. ఈ మధ్య ఒక్క ప్రశ్న అడిగితే వంద జవాబులు చెబుతోందని పేరు మార్చాను’’ తాపీగా చెప్పాడు ఏకదంతం.
11
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సెల్ఫీ దెబ్బ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సెల్ఫీ దెబ్బ' ‘‘ఏంటి బావా అలా చేతులు, మెడ పైకెత్తి నడుస్తున్నావు?’’ అడిగాడు బామ్మర్ది. ‘‘ఏం చెప్పను బామ్మర్దీ ... సెల్ఫీ తీసుకుంటుంటే పట్టేశాయి’’ మూలిగాడు బావ.
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అప్పుడయినా ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అప్పుడయినా ...' ‘డాక్టర్గారూ! మా ఆవిడకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందండి. ఏదైనా మందివ్వరా.’ ‘ఎందుకండి? పగలు ఎలాగూ నడుస్తున్నట్టు లేరు ఆవిడ. రాత్రిపూటయినా నడవనివ్వండి!’
6
['tel']
‘నీ పని చెప్తా ఉండు’ అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: '‘నీ పని చెప్తా ఉండు’' ఒక మనిషికి తన మెదడు మీద కోపం వచ్చింది. ‘ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తుంటావు. ఏదో ఒక పని చేయమని చెపుతుంటావు. నీ నోరు మూయించాలంటే ఒకటే మార్గం. ఇప్పుడు బార్కి వెళ్ళి మూడు సీసాల బీర్ తాగుతాను. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు’ అంటూ బయటికి నడిచాడు.
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎవరికిష్టమైన భాగం వారిది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరికిష్టమైన భాగం వారిది' ‘‘మానవ శరీరంలో ఏ భాగాన్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తామో చెప్పగలరా?’’ అడిగాడు సైన్స్ టీచర్.‘‘మగవారు కళ్లను, ఆడవారు నాలుకని ..’’ బదులిచ్చాడు వైకుంఠం.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏ రాయైుతే నేం? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏ రాయైుతే నేం?' ‘‘మీ ఇంట్లో అసలు టీవీనే లేదా?’’‘‘ఒకప్పుడు ఉండేది. మా ఆవిడ అస్తమానం సీరియల్స్ చూస్తోందని అమ్మిపడేశా ..’’‘‘వెరీ గుడ్ .. మంచి పనిచేశావు. మరి ఆవిడ ఏదీ? ఇంట్లో కనిపించడం లేదు!’’‘‘పక్కింట్లో టీవీ సీరియల్ చూడ్డానికి వెళ్లింది’’
6
['tel']
అప్పుడు ఎక్కువిస్తారా? అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అప్పుడు ఎక్కువిస్తారా?' ‘‘ఇలా రోడ్డు మీద నిల్చుని అడుక్కోటానికి సిగ్గు లేదూ?’’ కోపంగా అన్నాడు కాంభోజీరావు.‘‘మీరు వేసే బోడి రూపాయి కోసం ఆఫీసు ఓపెన్ చేయమంటారా?’’ అంతకంటే కోపంగా అడిగాడు బిచ్చగాడు.
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అంతకంటే డౌట్స్ లేవండి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతకంటే డౌట్స్ లేవండి' ‘‘ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. బాగా చదవాలి. ఆల్రెడీ కొశ్చన్ పేపర్లు కూడా ప్రింట్కు వెళ్లాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి’’ హెచ్చరించాడు లెక్చరర్.‘‘ప్రింటింగ్ ప్రెస్ పేరు చెప్పగలరా?’’ వెనక బెంచి నుండి వినిపించింది డౌట్.
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ‘బీమా’రావు కొడుకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘బీమా’రావు కొడుకు' ‘‘మమ్మీ ... నదిలో దిగి ఈత కొడతానే...’’‘‘వద్దు .. అందులో మొసళ్లున్నాయి ..’’‘‘మరి డాడీ ఈదుతున్నాడుగా ...’’‘‘డాడీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు ..’’
9
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ప్రకటనలో లోపం లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రకటనలో లోపం లేదు' దినపత్రిక తెరవగానే ఒక ప్రకటన ఆకర్షించింది వెంకటేశ్వర్లును.‘ఇదొక అద్భుత వస్త్రం. ఒక సాధుపుంగవుడు తన తపశ్శక్తితో రూపొంచిందిన మహిమగల వలువ. దీన్ని ధరించినచో ఎదుటివారు మీకు కనిపింతురు కాని ఎదుటివారికి మీరు కనిపించరు. ఆలస్యం చేయకుండా రుసుము చెల్లించి బుక్ చేసుకోండి. ’వెంకటేశ్వర్లు వెంటనే పది వేలు కట్టి పోస్టులో తెప్పించుకున్నాడు. పార్సల్ విప్పాడు. అందులో ఒక మామూలు బురఖా ఉంది.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చూస్తే .. మీరే ఒప్పుకుంటారు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చూస్తే .. మీరే ఒప్పుకుంటారు' ‘‘ఇలా దొంగతనాలు చేసి బతికేకంటే, కష్టపడి బతకొచ్చుకదా ...’’ సలహా ఇచ్చాడు జడ్జి ఏకదంతం.‘‘గునపంతో గోడలకు కన్నం వెయ్యడం, కిటికీ ఊచలు విరగ్గొట్టడం, తలుపు తాళాలు బద్దలు కొట్టడం ఇవన్నీ తేలిక పనులని అనుకుంటున్నారా? స్వయంగా చూస్తేగాని నేను పడుతున్న కష్టమేమిటో మీకు అర్థం కాదు’’ ఆవేశంగా చెప్పాడు చెంచయ్య.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఫోటోలు పంపండి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఫోటోలు పంపండి' ‘‘నాకు తెలిసిన సంబంధం ఒకటుంది. మీ అబ్బాయికి ఈడూ జోడూ బాగుంటుంది. అమ్మాయి కుందనం బొమ్మనుకో. అమ్మాయి పేర రెండు కోట్లు విలువచేసే బిల్డింగ్ ఉంది ..’’‘‘అందం కొరుక్కుతింటామా .. బిల్డింగ్ను నాలుగు వైపులనుండి ఫోటోలు తీసి పంపమనండి. మా అబ్బాయికి చూపిస్తాం’’
5
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బందు పుణ్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బందు పుణ్యం' ‘‘ఈరోజు అబ్బాయి కాలేజీకి వెళ్లినట్టున్నాడండి’’ సంతోషంగా చెప్పింది భార్య.‘‘వెళ్లక చస్తాడా .. ఈ రోజు సినిమాహాళ్లు బందు ప్రకటించాయి’’ బదులిచ్చాడు భర్త.
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అన్ని అయితే... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అన్ని అయితే...' టీచర్ : 1 పుస్తకం + 1 పుస్తకం. ఎన్ని? విద్యార్థి : 2 పుస్తకాలు. టీచర్ : 2 పుస్తకాలు + 2 పుస్తకాలు. ఎన్ని? విద్యార్థి : 4 పుస్తకాలు. టీచర్ : 5630 + 4370 పుస్తకాలు. ఎన్ని? విద్యార్థి : లైబ్రరీ.
11
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పాసైతే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పాసైతే ...' తండ్రి కొడుకుతో.. ‘టెన్త్ పాస్ అయితే నీకు సైకిల్ కొనిపెడతారా...’ ‘మరి ఫెయిల్ అయితేనో...’ ‘పది సైకిళ్ళు కొనిపెడతా’ ‘ఎందుకు నాన్నా?’ ‘సైకిల్ షాపు పెట్టుకోవడానికి.’
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ముందే తెలిస్తే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ముందే తెలిస్తే ...' తన స్నేహితురాలు గీత నడిచి రావడం చూసి స్కూటర్ ఏమైందని అడిగింది మంజు. గీత: లోన్ తీసుకుని కొన్నాకదా! వాయిదాలు కట్టడంలేదని దాన్ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుపోయారే. మంజు: ఈ విషయం ముందే తెలిస్తే నేను లోన్ తీసుకుని పెళ్ళి చేసుకునేదాన్ని కదే...
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కక్కలేక ... మింగలేక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కక్కలేక ... మింగలేక' భర్త: నీ ఏటీఎం పాస్వర్డ్ ఏంటి? భార్య: నా పుట్టినరోజు భర్త: దొరికిపోయా. కావాలనే చేసింది.
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక జాలి గుండె!? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జాలి గుండె!?' ఇద్దరు మిత్రులు బస్సులో కూర్చుని ఉన్నారు. ఒక స్టాప్లో కొందరు ఆడవాళ్ళు బస్సెక్కారు. వెంటనే ఇద్దరిలో ఒకడు కళ్ళు మూసుకున్నాడు. ‘‘ఎందుకురా కళ్ళు మూసుకున్నావు’’ అడిగాడు రెండోవాడు. ‘‘చాలామంది ఆడవాళ్ళు నిల్చుని ఉంటే కూర్చుని చూడడానికి నాకు మనసొప్పదురా’’ చెప్పాడు మొదటివాడు.
7
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దటీజ్ మొగుడు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దటీజ్ మొగుడు!' ఒక భర్త రాత్రి పొద్దుపోయాక తన భార్యకు ఇలా ఎస్.ఎం.ఎస్. చేశాడు. ‘‘నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దేవతవు నువ్వు. నీకు సర్వదా కృతజ్ఞుడను. ఇప్పుడు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే’’ ‘‘ఇవ్వాళ కూడా మందు ఎక్కువై నట్టుంది. నా ఖర్మ. ఏమీ అననులే. ఇంటికి తగలడు’’ అని రిప్లయ్ ఇచ్చింది. వెంటనే భర్త ‘‘థాంక్స్ - నేను ఇంటి బయటే ఉన్నాను. దయచేసి తలుపు తియ్’’ అంటూ మరో ఎస్.ఎం.ఎస్. ఇచ్చాడు.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మామిడి విలాపం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మామిడి విలాపం' ‘‘పదునైన కత్తితో మా తొడిమలు గిల్లి నునుపైన మా చెంపలు కత్తిరించి ముక్కముక్కలుగ నరికి పోగుపెట్టి ఉప్పు, ఆవ, నూనెలతో ముంచి తేల్చి ‘కొత్తావకాయ’నుచు లొట్టలేతురు అకటా! దయలేనివారు మీ ఆడువారు!!’’
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తర్కపోతు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తర్కపోతు' ‘‘వీటిల్లో ఆరు దొంగనోట్లున్నాయి .. చెల్లవు’’ చెప్పాడు బ్యాంకు క్యాషియర్. ‘‘నా ఖాతాలోనే కదా జమ చేసేది. అది దొంగ నోట్లయితే నీకేంటి? మంచి నోట్లయితే నీకేంటి?’’ అడ్డంగా వాదించాడు చెంగల్రావు.
10
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తప్పన్నానా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తప్పన్నానా?' ‘‘ఈత ఎక్కడ నేర్చుకున్నావ్’’ అడిగాడు మహేష్. ‘‘నీటిలో ...’’ ఠపీమని చెప్పాడు సురేష్.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అంతకంటే మరేం లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతకంటే మరేం లేదు' ‘‘మీలో సీనియర్కీ, జూనియర్కీ తేడా ఎవరు చెప్పగలరు?’’ అడిగింది టీచర్ మందాకిని. ‘‘సీ (సముద్రాని)కి దగ్గరగా ఉండేవారు సీనియర్స్, జూకి దగ్గరగా ఉండేవారు జూనియర్స్ మేడమ్’’ చెప్పాడు శంభులింగం.
10
['tel']
బుక్కయ్యాడు! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'బుక్కయ్యాడు!' ఒక విదేశీయుడు ఇండియా వచ్చాడు. ఒకరోజు అవసరమైన పుస్తకం కొందామని బుక్ స్టాల్కు వెళ్లాడు. అనుకోకుండా అక్కడ మరో పుస్తకం కనిపించింది. దాన్ని చూడగానే ఆ విదేశీయుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ పుస్తకం పేరు ‘‘30 రోజుల్లో డాక్టర్ కావడం ఎలా?!’’
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సూత్ర ప్రాయంగానే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సూత్ర ప్రాయంగానే ...' ‘‘నువ్వు ఏ సూత్రం ప్రకారం అంత డబ్బు డిమాండ్ చేస్తున్నావు నన్ను?’’ అడిగాడు లెక్కల మాస్టారైన భర్త. ‘‘మంగళసూత్రం ప్రకారం’’ నిక్కచ్చిగా చెప్పింది భార్య.
8
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చూస్తే నీకు పెళ్లయ్యేదా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చూస్తే నీకు పెళ్లయ్యేదా?' ‘‘నాలో ఏం చూసి పెళ్లిచేసుకున్నావ్?’’ గోముగా అడిగాడు కుమార్. ‘‘ఏమీ చూడలేదు కాబట్టే పెళ్లి చేసుకోగలిగాను’’ చెప్పింది శాంత.
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వండుకోనక్కర్లా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వండుకోనక్కర్లా' ‘‘ఎవడ్రా గులాబీ మొక్కనీ, జామ మొక్కనీ గొయ్యితీసి ఒక్క చోటే పాతింది?’’ అడిగాడు తాతయ్య. ‘‘నేనే తాతయ్యా .. పెద్దయ్యాక గులాబ్జాములు కాస్తాయని’’ చెప్పాడు మనవడు.
11
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వీరముదురు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వీరముదురు' ‘‘కొశ్చన్ పేపర్ లీక్ అయినా సరే కాపీ కొడుతున్నావెందుకురా?’’ అడిగాడు టీచర్. ‘‘ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని ఇంట్లో లైట్లు వేసుకోకుండా ఉంటామా?’’ బదులిచ్చాడు విద్యార్థి.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎవరు గొప్ప? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరు గొప్ప?' ‘‘గురుదక్షిణగా ఏకలవ్యుడు బొటన వేలు ఇచ్చాడు తెలుసా?’’ గొప్పగా చెప్పాడు పంతులు. ‘‘ఏకలవ్యుడు ఒక వేలు మాత్రమే ఇచ్చాడు. మేము ఎన్ని వేలు ఇస్తున్నా లెక్కలేదు’’ వెనక బెంచీ నుండి వినిపించాయి అరుపులు.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నాతో పెట్టుకోకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నాతో పెట్టుకోకు' ‘‘ఏయ్ .. పెద్దాయనా టికెట్ చూపించు’’ అడిగాడు టికెట్ కలెక్టర్. పంచె ముడి విప్పి టికెట్ తీసిచ్చాడు పెద్దాయన. ‘‘ఏంటి ... బుర్ర తిరుగుతోందా! ఇది పాత టికెట్టు’’ కోపంగా అన్నాడు టి.సి. ‘‘మరి ఇది మాత్రం కొత్త రైలా ..’’ అడ్డంగా వాదించాడు పెద్దాయన.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అసలే చలికాలం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసలే చలికాలం!' వారిద్దరూ కవలలు. ఒకడు ఏడుస్తుంటే, రెండోవాడు నవ్వుతున్నాడు. ‘‘ఎందుకురా తమ్ముడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు?’’ అప్పుడే ఇంట్లోకి వచ్చిన తండ్రి అడిగాడు. ‘‘నేననుకుని మమ్మీ వీడికి రెండోసారి స్నానం చేయించింది హా హా హా ..’’ చెప్పాడు పెద్దోడు.
12
['tel']
అన్నీ దాచేస్తుంది! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అన్నీ దాచేస్తుంది!' ‘‘హిమాలయాలు ఎక్కడుంటాయి డాడీ?’’ అడిగాడు పుత్రరత్నం. ‘‘ఏమో ... వాటిని కూడా మీ మమ్మీ బీరువాలో పెట్టి తాళం వేసేసి ఉంటుంది. వెళ్లి అడుగు’’ చెప్పాడు జనకుడు.
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎవరు గొప్ప? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరు గొప్ప?' ‘‘మా నాన్నకి బ్యాంక్ అకౌంట్ ఉంది. అర్జంటయితే వెంటనే డబ్బు తెస్తాడు తెలుసా?’’ గొప్పగా చెప్పాడు చంటి. ‘‘ఓస్ ... అంతేనా. మా నాన్నకు నోట్లో 4 బంగారు పళ్లున్నాయి. ఎప్పుడవసరం వచ్చినా ఇలా పీకి అలా తాకట్టు పెట్టేస్తాడు’’ మరింత గొప్పగా చెప్పాడు బంటి.
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మనసు కరక్కపోదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మనసు కరక్కపోదు' ‘‘ఎప్పుడూ మీ అమ్మను అంటిపెట్టుకుని తిరుగుతావెందుకురా?’’ ‘‘ఏదో సమయంలో నా హోమ్వర్క్ చేసిపెట్టకపోతుందా అని!’’
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రాత ఫలితం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రాత ఫలితం' ‘‘మీరు రాసిన ‘భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండటం ఎలా?’ అనే పుస్తకం చదివేక మా దాంపత్యం ఆనందంగా సాగిపోతోంది సార్’’ సంతోషంగా చెప్పాడు వైకుంఠం. ‘‘ఆ పుస్తకం ప్రచురించి డబ్బులు తగలేసానని మా ఆవిడ విడాకులు తీసుకుంది’’ విచారంగా చెప్పాడు రచయిత శ్రీశైలం.
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆమెకోసం కాదెహే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆమెకోసం కాదెహే ...' ‘‘ఎందుకురా ... దిగులుగా ఉన్నావు?’’ ‘‘మా ఆవిడ పాలుపోసే కుర్రాడితో వెళ్లిపోయిందిరా’’ ‘‘బాధపడితే వెళ్లిన భార్య తిరిగి వస్తుందా .. ఊరుకో’’ ‘‘నా బాధ అందుకు కాదురా ... అంత చిక్కటి పాలు పోసేవాడు మళ్లీ దొరకడేమోనని’’
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అంతే తేడా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతే తేడా!' ‘‘ఒరేయ్ .. సుబ్బులూ .. పట్నంలో నీది చొక్కా నలగని పనటగా నిజమేనట్రా?’’ అడిగాడు వెంకన్న. ‘‘అవును ... పనిచేసేటప్పుడు చొక్కా తీసేస్తాను’’ చెప్పాడు సుబ్బన్న
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పని మాత్రం ఆగట్లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పని మాత్రం ఆగట్లేదు' ‘‘ఏడాది నుండి మీ ఇంట్లో పనిమనిషి లేదన్నారుగా ... అయినా మీ ఒళ్లు కొంచెం కూడా తగ్గలేదు సుమీ’’ ఆశ్చర్యపోయింది అలివేలు. ‘‘పనిమనిషి లేదన్నాను కానీ మా ఆయన లేడన్నానా’’ బదులిచ్చింది కనకమాలక్ష్మి.
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆ నలుగురూ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆ నలుగురూ' పరీక్ష ఉందని తెలిసి కూడా ఎంచక్కా సినిమాకు చెక్కేసిన నలుగురు రూమ్మేట్స్ ఆ మర్రోజు లెక్చరర్తో ‘‘మా ఇంటి ఓనర్కు గుండె నెప్పి వస్తే ఆయన్తో పాటు ఆసుపత్రికి వెళ్లాం. తిరిగి వస్తుంటే మేము ఎక్కిన కారు టైరు పంక్చరై ఇల్లు చేరేసరికి రాత్రి ఒంటిగంట దాటింది. ఎగ్జామ్కు ప్రిపేర్ కాలేకపోయాం’’ అని చెప్పారు. లెక్చరర్ ఏం పర్వాలేదని, మీకు తెలిసినవే అడుగుతానని చెప్పి అప్పటికప్పుడు ఒక పరీక్షా పత్రాన్ని తయారు చేసి నలుగురికీ ఇచ్చాడు. అందులో ఇలా ఉంది. ‘‘ఆస్పత్రి పేరు, డాక్టరు పేరు, కారు పేరు, కారు నెంబరు, పంక్చరు అయిన టైరు ముందువైపుదా? వెనకవైపుదా? - ఈ ప్రశ్నలకు నలుగురూ ఒకే సమాధానాలు రాస్తే అందరికీ వంద మార్కులు వేస్తాను.’’
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రక్షణ కోసం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రక్షణ కోసం' ‘‘నాలుక తడిగానే ఎందుకుంటుంది?’’ అడిగింది సైన్స్ టీచర్. ‘‘నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడం కోసమేమో టీచర్’’ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు తరుణ్.
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మోడ్రన్ యమలోకం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మోడ్రన్ యమలోకం' ‘‘చిత్రగుప్తా ... తక్షణమే ఈ పాపి చిట్టా చూడు. తగిన శిక్ష విధిస్తాను’’ ఆదేశించాడు యమధర్మరాజు. ‘‘రెండు రోజులుగా సర్వర్ డౌన్లో ఉంది ప్రభూ .. నెట్ పునరుద్ధరింపబడేవరకు కుదరదు’’ విన్నవించాడు చిత్రగుప్తుడు.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బజ్జోవే దోమా ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బజ్జోవే దోమా ...' ‘‘రాత్రివేళ దోమల బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలిరా?’’ అడిగాడు వినోద్. ‘‘దోమలు నిద్రపోయిన తర్వాత మనం పడుకుంటే సరి’’ చెప్పాడు ప్రమోద్.
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కిటుకుల కిట్టయ్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కిటుకుల కిట్టయ్య' ‘‘మామూలు తాళంతో పాటు కాంబినేషన్ లాక్ ఉన్న బీరువాను ఎలా తెరవగలిగావు?’’ ఆసక్తిగా అడిగాడు న్యాయమూర్తి నారాయణ. ‘‘(కాస్త సందేహిస్తూ) ఇలాంటి కిటుకులు చెప్పడానికి సాధారణంగా వెయ్యి రూపాయల ఫీజు తీసుకుంటానండి’’ సిగ్గుపడుతూ చెప్పాడు ముద్దాయి మునిరత్నం.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తిట్లు నీకు .. విషయం నాకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిట్లు నీకు .. విషయం నాకు' ‘‘సార్, మీ ఆవిడ నుండి ఫోన్’’ రిసీవర్ అందించబోయాడు సెక్రటరీ. ‘‘రెండు నిమిషాల తర్వాత ఇవ్వు’’ చెప్పాడు బాస్. ‘‘ఎందుకు సార్?’’ ఆశ్చర్యపోయాడు సెక్రటరీ. ‘‘ఆవిడ ఎవరికి ఫోన్ చేసినా రెండు నిమిషాల వరకు ఆగకుండా తిట్టి, ఆనక అసలు విషయం చెబుతుంది’’ చెప్పాడు బాస్.
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏం చేసేవారో? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏం చేసేవారో?' ‘‘ఇప్పటి పరిస్థితుల్లో గాంధీగారుంటే ఏం చేసేవారో’’ అడిగాడు టీచర్. ‘‘పెన్షన్ తీసుకుంటూ, స్వచ్ఛభారత్లో పాల్గొంటూ ఉండేవారు’’ ఠపీమని చెప్పాడు భజగోవిందం.
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక టపా కట్టే వయసే ముఖ్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'టపా కట్టే వయసే ముఖ్యం' డెభై ఏళ్ల వైకుంఠం పాతికేళ్ల పడుచు ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆమెతో చెప్పడానికి ధైర్యం చాలక - ‘‘ఒరే, పెళ్లీ పెటాకులూ లేకుండా ఇన్నేళ్లూ వ్యాపారంలో పడి దాదాపు పదికోట్లు వెనకేశాను. అనుభవించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పడుచుపై మనసు పడ్డాను. నా వయసు 30 ఏళ్లు తగ్గించి చెబితే పెళ్లికి ఒప్పుకుంటుందం టావా’’ మిత్రుడు శ్రీశైలంతో మొరపెట్టుకున్నాడు. ‘‘కచ్చితంగా ఒప్పుకుంటుంది - కాకపోతే, ఇప్పటి నీ వయసుకి మరో 20 ఏళ్లు కలిపి చెబితే’’ సలహా ఇచ్చాడు శ్రీశైలం.
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేడా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేడా' ‘‘అద్దానికి, అబద్ధానికి తేడా ఏంటి?’’ అడిగింది టీచర్. ‘‘అద్దం ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. అబద్ధం లేనిది ఉన్నట్టు చెబుతుంది’’ ఠపీమని చెప్పాడు బంటీ.
7
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పోలిక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పోలిక' ‘‘ప్రేమకు, పెళ్లికి తేడా ఏంటి?’’ అడిగాడు సురేష్. ‘‘ప్రేమ సైకిల్ ప్రయాణమైతే, పెళ్లి పడవ ప్రయాణం’’ చెప్పాడు రమేష్. ‘‘అదెలా?’’ ఆరా తీశాడు సురేష్. ‘‘ఇష్టం లేకపోతే సైకిల్ దిగిపోవచ్చు. కాని పడవప్రయాణంలో మధ్యలో దిగడం కుదరదు కదా’’ వివరించాడు రమేష్.
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పది రూపాయలే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పది రూపాయలే!' ‘‘నువ్వు మీ అమ్మ ద్వారా తెలుసుకుని చేసిన గుత్తివంకాయ కూర ఖరీదు 155 రూపాయలు’’ కొత్తగా కాపురం పెట్టిన రామానుజం భార్యతో అన్నాడు. ‘‘అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?’’ ఆశ్చర్యపోయింది వసుంధర. ‘‘ఇదిగో ఎస్.టి.డి. బిల్’’ చూపెట్టాడు రామానుజం.
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ముందు జాగ్రత్త! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ముందు జాగ్రత్త!' ‘‘రోజీ ... ఇక లాభంలేదు. ఈ రోజు రాత్రి సరిగ్గా రెండు గంటలకు మనం ఈ ఊరు విడిచి పారిపోవాలి. సరిగ్గా ఆ టైమ్కు లగేజ్తో నీవు సిద్ధంగా ఉండాలి’’ చెప్పాడు ప్రియుడు స్వప్నిల్. ‘‘నువ్వేమీ బెంగ పెట్టుకోకు స్వప్నిల్. మా నాన్న నిన్ననే నా లగేజ్ పాక్ చేసి పెట్టాడు’’ బదులిచ్చింది రోజీ.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చిక్కలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చిక్కలేదు' చాలాకాలం తర్వాత రెండు పుస్తకాలు ఎదురుపడ్డాయి లైబ్రరీ టేబిల్ మీద. ‘ఏంటలా చిక్కిపోయావు? ఎండలకా?’ అని అడిగింది ఒక పుస్తకం రెండోదాన్ని. ‘కాదు. ఎవడికో కోపం వచ్చి ముందుమాటలన్నీ చించేశాడు’ జవాబిచ్చింది అది.
13
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఇప్పుడా... ఇదివరకా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇప్పుడా... ఇదివరకా?' ‘‘నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఊరికి దూరంగా బతికేవాళ్ళను ఏమంటారు?’’ టీచర్ ఒక పిల్లవాణ్ణి అడిగాడు. ‘‘ఇప్పుడా? ఇదివరకా?’’ అడిగాడు పిల్లవాడు. ‘‘రెండూ చెప్పు’’ ఆశ్చర్యపోతూ అన్నాడు టీచర్. ‘‘ఇదివరకైతే ఋషులు. ఇప్పుడైతే ఐ.టి. ఉద్యోగులు.’’
13
['tel']
ఎవరు మాట్లాడుతున్నది? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఎవరు మాట్లాడుతున్నది?' భార్యాభర్తలు ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నారు. భర్త మద్యం తాగుతున్నాడు. ఉన్నట్టుండి ‘ఐ లవ్ యు’ అన్నాడు. భార్య ఆశ్చర్యపోయింది. ‘‘నువ్వా, నీ విస్కీనా మాట్లాడుతున్నది?’’ అనడిగింది. ‘‘నేనే. నా విస్కీతో మాట్లాడుతున్నా?’’ చెప్పాడు భర్త.
1
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేమ్ ప్లేట్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేమ్ ప్లేట్' ‘‘హలో సార్ పోయిన సంవత్సరం ఈ వీధిలో వెళుతున్నపుడు చూస్తే మీ ఇంటి ముందు సురేష్ బి.ఎ. అని ఉంది. ఇప్పుడు చూస్తే సురేష్ ఎం.ఎ అని ఉంది. ఏడాదిలో ఎం.ఎ పూర్తి చేశారా?’’ అడిగాడు ఒకాయన ఆ దారిన పోతూ. ‘‘మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. పోయిన సంవత్సరం మా ఆవిడ చనిపోయినపుడు ‘బ్యాచిలర్ ఎగైన్’ అన్న అర్థంలో బి.ఎ. అని పెట్టాను. ఈ మధ్యే మళ్ళీ పెళ్ళి చేసుకున్నా కాబట్టి ‘మ్యారీడ్ ఎగైన్’ అర్థంలో ఎం.ఎ అని పెట్టాను’ వివరించాడు సురేష్.
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏది ముందు? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏది ముందు?' లెక్చరర్ స్టూడెంట్ని అడిగాడు... ‘‘పది తేలిక ప్రశ్నలు అడగనా? లేక ఒక కష్టమైన ప్రశ్న అడగనా?’’ ‘‘కష్టమైన ప్రశ్నే అడగండి’’ చెప్పాడు స్టూడెంట్. ‘‘ఏది ముందు వస్తుంది? పగలా, రాత్రా?’’ ‘‘పగలు.’’ ‘‘ఎలా చెప్పగలవు?’’ ‘‘సారీ సార్... మీరు ఒకటే ప్రశ్న అడుగుతానన్నారు’’ స్టూడెంట్ జవాబిచ్చాడు.
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అర్థం ఇది! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అర్థం ఇది!' ‘వైఫ్ పూర్తి అర్థం ఏమిటో తెలుసా నీకు?’ భర్త భార్యను అడిగాడు. ఆమె ఏదో చెప్పేలోపలే ‘‘""Without Information Fighting Everytime (ముందస్తు సమాచారం లేకుండా అస్తమానం పోట్లాడేది-WIFE)’’ అన్నాడు. ‘‘కాదు కాదు.With Idiot For Ever''’’ అని తిప్పికొట్టింది భార్య.
12
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రాసలీల వేళ రాయబారమేల? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రాసలీల వేళ రాయబారమేల?' ‘‘డాక్టర్ని ప్రేమించడం పొరపాటైపోయిందే’’ వాపోయింది సుజాత. ‘‘ఏమయిందే?’’ ఆరా తీసింది హరిత. ‘‘ఆయన రాసే ప్రేమలేఖలు అర్థంగాక, అస్తమానం మెడికల్ షాపు వారితో చదివించుకోవాల్సి వస్తోంది’’ బదులిచ్చింది సుజాత.
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పొదుపు అవసరం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పొదుపు అవసరం' ‘‘సార్, మన సినిమాలో బిచ్చగత్తె పాత్రకి సాదాసీదా మొహం గల అమ్మాయి కావాలి’’ చెప్పాడు డైరెక్టరు. ‘‘ఇప్పటికే బడ్జెట్ ఎక్కువై ఏడుస్తుంటే మరొకర్ని ఎక్కడ్నుంచి తెచ్చేదయ్యా? మన హీరోయిన్నే మేకప్ లేకుండా చూపించు చాలు’’ చిరాగ్గా సలహా ఇచ్చాడు నిర్మాత భజగోవిందం.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒకరికి ఖేదం - ఒకరికి మోదం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకరికి ఖేదం - ఒకరికి మోదం' ‘‘సార్ ... ‘డబ్బు సంపాదించడం ఎలా?’ అనే మీరు రాసిన పుస్తకం చదివిన తర్వాతే నేను లక్షాధికారిని కాగలిగాను - ధన్యవాదాలు’’ సంతోషంగా చెప్పాడు వీరగంధం. ‘‘ఆ పుస్తకం ప్రచురించడానికి నా ఆస్తంతా అమ్ముకోవలసి వచ్చింది’’ బాధగా బదులిచ్చాడు రచయిత రాజలింగం.
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బాల వాది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బాల వాది' ‘‘అన్యాయం, అక్రమం ... రేపట్నించి స్కూల్కి వెళ్లనంతే’’ . ‘‘ఏం జరిగిందిరా?’’ కంగారుగా అడిగింది ఆదిలక్ష్మి. ‘‘మా టీచర్ పుస్తకం చూసి మాకు పాఠం చెప్పొచ్చట గానీ, మేం మాత్రం పుస్తకం చూడకుండా పాఠం అప్పజెప్పాలట’’ ఎగిరిపడ్డాడు ఆరేళ్ల చింటూ.
13
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పీనాసి మొగుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పీనాసి మొగుడు' పెళ్లయిన పదేళ్ల తర్వాత పిచ్చయ్య భార్యతో షికారుకు వెళ్లాడు. దారిలో ఒక మిఠాయి కొట్టు దగ్గర ఆగి ‘‘ఏమోయ్ ... మరో స్వీట్ తింటావా?’’ జేబులోంచి పర్స్ తీస్తూ డాబుగా అడిగాడు. ‘‘మరోటా ... ?’’ ఆశ్చర్యపోయింది అలివేలు. ‘‘అప్పుడే మర్చిపోతే ఎట్టా? మన పెళ్లయిన కొత్తలో ఇదే షాపులో నీకు మైసూరుపాక్ కొనిచ్చా’’ గుర్తు చేశాడు పిచ్చయ్య.
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తిక్క శంకరయ్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిక్క శంకరయ్య' ‘ఇచ్చట పెళ్లికి కావలసిన అన్ని రకాల సరుకులు అమ్మబడును’ ఆ బోర్డు చూసిన శంకరయ్య కొట్టుముందు ఆగి, యజమానితో ‘‘నాలుగు రకాల పెళ్లికూతుళ్లని చూపండి .. నచ్చితే ఒకటి కొంటాను’’ అడిగాడు అమాయకంగా.
10
['tel']
వాడనివ్వరసలు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'వాడనివ్వరసలు' ‘‘అదేమిటే ... మీ ఆయన నీ కూడా ఉండి మాటిమాటికి నీ నెత్తిపై నీళ్లు చల్లుతున్నాడు?’’ ఆశ్చర్యపోయింది స్నేహితురాలు రాధిక. ‘‘ నా నెత్తిన కాదు, నా తల్లోని పూలమీద .. పూలకొట్లో పనిచేస్తారులే’’ తాపీగా బదులిచ్చింది మోహిని.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చిత్తభ్రాంతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చిత్తభ్రాంతి' ‘‘పెళ్లయ్యాక నీ లైఫ్లో వచ్చిన మార్పేమిటోయ్?’’ అడిగాడు ఆనందరావు. ‘‘పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కతే అప్సరసలా కనిపించేది. పెళ్లయ్యాక మా ఆవిడ తప్పించి తతిమ్మా వాళ్లంతా అప్సరసల్లా కనిపిస్తున్నారు’’ వాపోయాడు భాస్కర్రావు.
11
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బుద్ధి మారలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బుద్ధి మారలేదు' ‘‘ఈ డాక్టరు ఇంతకుముందు హోటలు నడిపినట్టున్నాడ్రా?’’ కసిగా అన్నాడు వెంకట్రావు. ‘‘ఎలా చెప్పగలిగావు?’’ ఆసక్తిగా అడిగాడు అప్పారావు. ‘‘ఇంజక్షన్ చేయించుకున్నాక డబ్బుల్లేవన్నానని ఆస్పత్రి బెడ్ షీట్లన్నీ నాతో ఉతికించాడు’’ బావురుమన్నాడు వెంకట్రావు.
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నిద్దరకు పనికొచ్చిన కథ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నిద్దరకు పనికొచ్చిన కథ' ‘‘రాత్రి పూట ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కథ చెప్పడం తప్పయిపోయిందిరా’’ చెప్పాడు రచయిత రామారావు. ‘‘ఏమన్నాడు ... కథ నచ్చలేదన్నాడా?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘నీవు కథ చెబుతుంటే జోలపాడినట్టుంది. ప్రతి రోజూ వచ్చి నాకు నిద్దరొచ్చేదాకా చెబుతూ ఉండని అన్నాడ్రా’’ బావురుమన్నాడు రామారావు.
10
['tel']
నేటి ప్రేమ అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నేటి ప్రేమ' ‘‘ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా ... ఈలోగా ప్రేమికుల రోజు జరుపుకోవాలా రాజూ?’’ సందేహంగా అడిగింది రాణి. ‘‘పెళ్లిరోజు వరకు కలిసుంటామంటావా’’ ఠపీమని బదులిచ్చాడు రాజు.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డూప్ లేక నేను లేను ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'డూప్ లేక నేను లేను' ‘‘శోభనం రోజే మీ ఆవిడ మిమ్మల్ని చెప్పుతో కొట్టడానికి కారణం?’’ అడిగాడు విలేకరి. ‘‘నాది మొదట్నించి రిస్క్ తీసుకునే మనస్తత్వం కాదు. ఎందుకైనా మంచిదని ముందుగా శోభనం గదిలోకి నా డూప్ని పంపాను’’ తాపీగా బదులిచ్చాడు సినిమా హీరో.
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ‘యాడే’ అసలు కారణం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘యాడే’ అసలు కారణం' ‘‘మన టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడం వెనకున్న కారణం కనిపెట్టారా?’’ కోపంగా అడిగాడు యజమాని. ‘‘ప్రతి టూ వీలర్తో పాటు టూల్ సెట్కి బదులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫ్రీ అనే యాడ్ ఇవ్వడం వల్ల’’ నసుగుతూ చెప్పాడు సేల్స్మేన్.
14
['tel']
డబ్బారాయుళ్లు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'డబ్బారాయుళ్లు' ‘‘మీకోసం గంగాజలంతో కాఫీ చేయించాను. తాగండి’’ చెప్పాడు కోతలరాయుడు. ‘‘అబ్బెబ్బే వద్దు ... నీనిప్పుడే అమృతం తాగి ఇలా వచ్చా’’ బదులిచ్చాడు డాబులరాయుడు.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కంత్రీ మొగుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కంత్రీ మొగుడు' ‘‘ఫిల్టర్ కాఫీ తయారుచేసుకు వస్తానని వంటింట్లోకి వెళ్లిందా ... గుండె నెప్పి అంటూ కేకేసి కుప్పకూలిపోయింది’’ చెప్పాడు బాబూరావు. ‘‘అయ్యోపాపం .. మీ కష్టం పగాళ్లకైనా రావద్దు. వెంటనే ఏం చేశారు?’’ జాలిగా అడిగాడు సుబ్బారావు. ‘‘ఏం చేస్తాను ... చచ్చినట్టు ఇన్స్టెంట్ కాఫీ కలుపుకు తాగి, ఆనక అంబులెన్స్కి కాల్ చేశా’’ చిరాగ్గా చెప్పాడు బాబూరావు.
11
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేరగొస్తే ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేరగొస్తే ...' ‘‘తల నెప్పిగా ఉంది ... ఎదురింటాళ్లనడిగి జండూబామ్ తీసుకురా’’ పురమాయించాడు భర్త. ‘‘సర్లెండి ... వాళ్లుత్త పీనాసి పీనుగులు ... పిల్లికి బిచ్చం పెట్టరు’’ ఈసడించింది భార్య. ‘‘కాల మహిమ .. చేసేదేముంది, అయితే మన అల్మారాలో ఉన్న జండూబామ్ తీసుకురా’’ చెప్పాడు భర్త.
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆటోజా ... తప్పింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆటోజా ... తప్పింది' ‘‘నీ కూతురి పేరు అంబుజా ... వెరైటీగా ఉందే’’ ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి. ‘‘అంబులెన్స్లో పుట్టిందని అలా పెట్టాం’’ గర్వంగా చెప్పింది మీనాక్షి. ‘‘నయం ... ఆటోలో పుట్టలేదు’’ నవ్వింది కామాక్షి.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మిత్రలాభం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మిత్రలాభం' ‘‘ఒరే శీనూ .. నీటముంచినా, పాలముంచినా నీదే భారం’’ దీనంగా అన్నాడు భాను. ‘‘అంత ఖర్చుపెట్టి పాలు తేలేను కానీ, నీట్లో ముంచుతాలే’’ తాపీగా చెప్పాడు శీను.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మాతృప్రేమ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాతృప్రేమ' ‘‘మా అమ్మాయిని కొట్టకండి టీచర్ .. జ్వరమొచ్చిద్ది’’ చెప్పింది సుబ్బలక్ష్మి. ‘‘అల్లరి బాగా చేస్తే తప్పదు మరి’’ నవ్వుతూ అంది టీచరమ్మ. ‘‘అప్పుడు పక్కమ్మాయిని కొట్టండి. మా అమ్మాయి వెంటనే అల్లరి మానేస్తుంది’’ సలహా ఇచ్చింది సుబ్బలక్ష్మి.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చిట్టి తవిక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చిట్టి తవిక' శ్రీరామ రక్ష - రేపే పరీక్ష పూనాను దీక్ష - పాసయితే లక్ష ఫేలయితే రిక్షా - అదే నాకు శిక్ష!
8
['tel']
అంతకంటేనా? అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అంతకంటేనా?' ‘‘నేను ఏ ధర్మం చేస్తే ప్రజలు నన్ను గౌరవిస్తారంటావు సెక్రటరీ?’’ అడిగాడు మంత్రి పున్నారావు. ‘‘కాలధర్మమండి’’ ఠపీమని సెలవిచ్చాడు సెక్రటరీ.
2
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అసలంటూ ఉండాలిగా .. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసలంటూ ఉండాలిగా ..' ‘‘మనూరి గవర్నమెంటు ఆస్పత్రిలో మెదడువాపు వ్యాధి రాకుండా బిళ్లలిస్తున్నారట .. వెళ్లొస్తాను’’ గడపదాటుతూ చెప్పాడు చెంగల్రావు. ‘‘అవి మెదడున్నోళ్ళకేమోనండి ...’’ వెనకనుండి వినిపించింది భార్య గొంతు.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక శాంపుల్ చూడండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'శాంపుల్ చూడండి!' ‘‘ఈ ఎలకలమందు బాగా పని చేస్తుందా?’’ అనుమానంగా అడిగాడు వీరగంధం. ‘‘అంత అనుమానమైతే కొంచెం తిని చూడండి’’ అలవాటుగా చెప్పాడు దుకాణం యజమాని.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అద్గదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అద్గదీ సంగతి!' ‘‘ఏంటయ్యా సర్వరూ ... అన్నం ఇంత నల్లగా తగలడ్డదేం?’’ కోపంగా అరిచాడు సుబ్బారావు. ‘‘మా ప్రొప్రయిటరు బియ్యాన్ని బ్లాకులో కొన్నారటండి’’ తాపీగా బదులిచ్చాడు సర్వర్.
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నన్నలా పంచుకున్నారు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నన్నలా పంచుకున్నారు' ‘‘మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి, సాయంత్రం నానమ్మ ఇంటికి భోజనానికి వెళ్తున్నావెందుకురా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బంటి. ‘‘మా అమ్మానాన్న పోట్లాడుకుని వాళ్ల వాళ్ల పుట్టిళ్ళకు వెళ్లారు. అందుకే నాకీ తిప్పలు’’ నిట్టూరుస్తూ చెప్పాడు చంటి.
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అఖిల భారత తాగుబోతుల సంఘం డిమాండ్లు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అఖిల భారత తాగుబోతుల సంఘం డిమాండ్లు' 1. వికలాంగులకు ఇంటికే మందు సప్లయ్ చేయాలి. 2. తెల్ల రేషన్ కార్డ్ వాళ్లకు సగం ధరకే మందు అందించాలి. 3. తాగి రోడ్లకు అడ్డంగా పడిపోయిన వారిని ప్రభుత్వం అంబులెన్స్ ద్వారా ఇంటికి భద్రంగా చేర్చాలి. 4. తాగుబోతులకు సమాజంలో తగిన గౌరవం ఇవ్వాలి. భార్యలు తిట్టకుండా చూడాలి. 5. మద్యం పైన నిషేధం విధించేముందు మా సంఘంతో సంప్రదింపులు జరపాలి. 6. మద్యం రాబడివల్లే ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి తాగి పోయినోళ్ల అంత్యక్రియల ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. 7. అలాగే తాగి అనారోగ్యం పాలయినవారికి ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలి. జై తాగుబోతు సంఘం ... జై జై తాగుబోతు సంఘం
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కొత్త వంటకం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొత్త వంటకం' ‘‘ఆకలి మీదున్నాను .. ఏం కూర’’ క్యాంపు నుండి వస్తూ వాకిట్లోంచే అరిచాడు సుబ్బారావు. ‘‘చికెన్ - 20 ’’ చెప్పింది భార్యామణి. ‘‘కొత్త వంటకమా?’’ లొట్టలేశాడు సుబ్బారావు. ‘‘లేదు. వండి 20 రోజులైంది’’ చెప్పింది భార్యామణి.
13
['tel']
ఇతరులంటే? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఇతరులంటే?' ‘‘ఇతరులకు సహాయం చేయడానికే దేవుడు మనల్ని సృష్టించాడట ... ఫాదర్ మాథ్యూ చెప్పారు’’ అన్నాడు జాన్. ‘‘అవును బాబూ .. ఫాదర్ చెప్పింది నిజం. అందుకే మనం ఇక్కడున్నాం’’ చెప్పాడు తండ్రి రాబర్ట్. ‘‘కాని ఇతరులు ఇక్కడ ఎందుకు ఉన్నారు డాడీ?’’ సందేహం వెలిబుచ్చాడు జాన్.
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బద్ధకాల బాబు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బద్ధకాల బాబు' ‘‘ఒకరోజు వస్తుంది. ఆ రోజు తినడానికి తిండి దొరకదు. తాగడానికి మంచినీళ్లు దొరకవు. పెట్రోల్, డీజిల్, కరెంట్ .. అన్నీ అంతమవుతాయి. జనాలు ఒకర్నొకరు కొట్టుకు చస్తారు. ప్రపంచం సర్వనాశనం అవుతుంది ... ఇదే జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి’’ మీటింగులో చెప్పాడు యజమాని. పిన్డ్రాప్ సైలెన్స్ మధ్య ‘‘ఆ రోజు కూడా ఆఫీసుకు రావాలా సార్?’’ ఆవలిస్తూ ప్రశ్నించింది ఒక స్వరం.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దాంపత్యంలో... దాగుడు మూతలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దాంపత్యంలో... దాగుడు మూతలు' ‘‘ఒంట్లో బాగోలేదండి ... ఈ పూటకి హోటల్లో తినేసి రండి’’ పడుకుని మూల్గింది వనజ. ‘‘అయ్యో ... నిన్ను షాపింగుకి తీసుకెళ్దామని పెందలాడే ఇంటికి వచ్చానే’’ బాధపడ్డాడు సుబ్రహ్మణ్యం. ‘‘అబ్బే ... బానే ఉంది. ఉత్తినే చెప్పానంతే’’ ముసుగు తీసి చెంగున గెంతింది వనజ. ‘‘నేనూ తమాషాకే అన్నాను. వెళ్లి వంట చెయ్యి’’ టవల్ తీసుకుంటూ తాపీగా చెప్పాడు సుబ్రహ్మణ్యం.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నవ్వాల్సిన అవసరం లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నవ్వాల్సిన అవసరం లేదు' ఒక కార్పొరేట్ ఆఫీసులో బాస్ జోక్ వేశాడు. ఆయనకింద పనిచేస్తున్న వాళ్లలో సతీష్ తప్పించి మిగతావారంతా పగలబడి నవ్వారు. కొంత సమయం తర్వాత - ‘‘నా జోక్కు నీకు నవ్వు రాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బాస్. ‘‘నాకు వేరే కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ అయ్యింది’’ బదులిచ్చాడు సతీష్
6
['tel']
నా ఆదాయానికి గండి! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నా ఆదాయానికి గండి!' ‘‘మా మావయ్య గత సంవత్సరం నుండి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడండీ’’ బుల్లబ్బాయి. ‘‘ఏం చేస్తున్నాడు?’’ సైక్రియాటిస్టు. ‘‘కుర్చీని కారనుకుని స్టీరింగ్ తిప్పుతున్నాడు’’ బుల్లబ్బాయి. ‘‘అది కారు కాదు, కుర్చీ అని చెప్పలేకపోయావా?’’ సైక్రియాటిస్టు. ‘‘ఎలా చెప్పను? కారు అనుకుని ఆ కుర్చీని కడిగినప్పుడల్లా నాకు 200 రూపాయలు ఇచ్చేవాడు’’ బుల్లబ్బాయి.
2
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ‘బిజినెస్’ ఫాదర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘బిజినెస్’ ఫాదర్' ‘‘ఒక అమ్మాయితో నీ పెళ్లి జరపించాలనుకుంటున్నాను’’ తండ్రి. ‘‘నో’’ పుత్రుడు. ‘‘ఆ అమ్మాయి బిల్గేట్స్ కూతురు’’ తండ్రి. ‘‘అయితే ఓకే’’ కొడుకు. - బిల్గేట్స్ని కలిశాడు తండ్రి. ‘‘మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుందామని వచ్చాను’’ తండ్రి. ‘‘నో’’ బిల్గేట్స్. ‘‘మా అబ్బాయి వరల్డ్ బ్యాంకు సిఇఓ’’ తండ్రి. ‘‘అయితే ఓకే’’ బిల్గేట్స్. - వరల్డ్బ్యాంకు ప్రెసిడెంట్ను కలిశాడు తండ్రి. ‘‘మా అబ్బాయికి మీ బ్యాంకులో సిఇఓగా ఉద్యోగం ఇవ్వండి’’ తండ్రి. ‘‘నో’’ ప్రెసిడెంట్. ‘‘మా అబ్బాయి బిల్గేట్స్ అల్లుడు’’ తండ్రి. ‘‘అయితే ఓకే’’
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మగబుద్ధి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మగబుద్ధి' హడావిడిగా రైలెక్కిన హారిక ఒకబ్బాయితో - ‘‘మీ పక్కనున్న ఖాళీ సీట్లో కూర్చోవచ్చా?’’ అడిగింది. ‘‘ఆ సీటు మీ కోసమే’’ చెప్పాడు అబ్బాయి. ‘‘దాహంగా ఉంది. మీ బాటిల్లోని నీళ్లు తాగొచ్చా’’ అడిగింది హారిక. ‘‘మై ప్లెజర్!’’ చెప్పాడు అబ్బాయి. కాసేపయ్యాక - ‘‘అన్నయ్యా ... రాబోయే స్టేషన్ ఏది?’’ అడిగింది అమ్మాయి. ‘‘నా బుర్రలో దివ్యశక్తి ఉందనుకున్నావా? లెగు లెగు ... నిద్రొస్తుంది నాకు’’ కసురుకున్నాడు అబ్బాయి.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రయత్నించు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రయత్నించు!' టీ కప్పులో టీ చూడగలను నేను! వరల్డ్ కప్పులో వరల్డ్ చూడగలవా నువ్వు? నీ సెల్కి నా అడ్రస్ పంపగలను నేను! నా అడ్రస్కి నీ సెల్ పంపగలవా నువ్వు?
11
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తడవడం గ్యారంటీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తడవడం గ్యారంటీ' ‘‘బాధకీ భయానికి తేడా ఏమిట్రా?’’ అడిగాడు ఆనందం. ‘‘బాధ పడితే షర్టు తడుస్తుంది. భయపడితే నిక్కరు తడుస్తుంది’’ ఠపీమని చెప్పాడు భాస్కరం.
3
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దటీజ్ మొగుడు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దటీజ్ మొగుడు!' ఒక భర్త రాత్రి పొద్దుపోయాక తన భార్యకు ఇలా ఎస్.ఎం.ఎస్. చేశాడు. ‘‘నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దేవతవు నువ్వు. నీకు సర్వదా కృతజ్ఞుడను. ఇప్పుడు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే’’ ‘‘ఇవ్వాళ కూడా మందు ఎక్కువై నట్టుంది. నా ఖర్మ. ఏమీ అననులే. ఇంటికి తగలడు’’ అని రిప్లయ్ ఇచ్చింది. వెంటనే భర్త ‘‘థాంక్స్ - నేను ఇంటి బయటే ఉన్నాను. దయచేసి తలుపు తియ్’’ అంటూ మరో ఎస్.ఎం.ఎస్. ఇచ్చాడు.
13
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ సంగతి!' ‘‘బాబూ అన్నం తిని మూడు రోజులైంది. ఒక రూపాయి ఉంటే దానం చెయ్యండి’’ చెయ్యి చాచింది బిచ్చగత్తె. ‘‘ఒక్క రూపాయితో ఏమొస్తుంది?’’ ఆశ్చర్యపోయాడు శంభులింగం. ‘‘ఎంత వెయిట్ తగ్గానో చూసుకుంటానయ్యా’’ చెప్పింది బిచ్చగత్తె.
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పందెం గెలిచింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పందెం గెలిచింది' ఒక కోడికి పూలదండ వేసి వీధిలోని కోళ్లన్నీ కలిసి ఊరేగిస్తున్నాయి. ఆ సంబరం చూసిన ఒక కాకి పక్క కాకిని ‘‘ఎన్నికల్లో గెలిచిందా?’’ అని అడిగింది. ‘‘కాదు - చికెన్ షాపు ముందుకెళ్లి తొడకొట్టిందట!’’ చెప్పింది పక్క కాకి.
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆయన చేతిలో లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆయన చేతిలో లేదు' ‘‘గత పదేళ్లుగా కఠోర తపస్సు చేస్తున్నా ... దేవుడు ప్రత్యక్ష్యం కావటం లేదు స్వామీ?’’ అడిగాడు జూనియర్ స్వామి. ‘‘ఏం కోరుకుందామని ఈ తపస్సు?’’ కళ్లు విప్పి అడిగాడు సీనియర్ స్వామి. ‘‘ధరలు తగ్గించమని అడుగుతా’’ నిజాయితీగా చెప్పాడు జూనియర్. ‘‘ఈ జన్మలో నీకు దేవుడు ప్రత్యక్షం కాడు’’ మళ్లీ కళ్లు మూసుకుంటూ అన్నాడు సీనియర్.
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వీరు వారవలేరు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వీరు వారవలేరు' ‘‘మనిషికీ, గాడిదకీ తేడా చెప్పు చూద్దాం?’’ అడిగాడు పంతులు కోదండరామయ్య. ‘‘మనిషి గాడిద కాగలడు కానీ, గాడిద మనిషి కాలేదండి’’ చెప్పాడు వీరబాబు.
10
['tel']
యమ ‘కంత్రీ’ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'యమ ‘కంత్రీ’' ముగ్గురమ్మాయిలు నరకానికి వెళ్లారు. ‘ముద్దు’ అనుభవం ఉందా అని ఆరాతీశాడు యమభటుడు. ‘‘నేను పెళ్లికి ముందు నా బాయ్ ఫ్రెండుకు కిస్సిచ్చా’’ - మొదటి అమ్మాయి. ‘‘నీవు నరకానికి - ఫో’’ - యమభటుడు. ‘‘పెళ్లయ్యాక మా ఆయనకి కిస్సిచ్చా’’ - రెండో అమ్మాయి. ‘‘నీవు స్వర్గానికి పో’’ - యమభటుడు. ‘‘జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కిస్సివ్వలేదు’’ - మూడో అమ్మాయి. ‘‘నీవు నా గదిలోకి పో’’ ఆనందంగా అన్నాడు యమభటుడు.
2
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఓల్డెస్ట్ యానిమల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఓల్డెస్ట్ యానిమల్' ‘‘భూమ్మీద ఇప్పటికీ కనిపించే అతి ప్రాచీన జంతువు ఏది?’’ ‘‘జీబ్రా’’ ‘‘ఎలా?’’ ‘‘ఇప్పటికి అది బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది కాబట్టి’’
7
['tel']