text
stringlengths
3
3.17k
అన్ని సబ్జెక్టుల్లోకీ 2వ అత్యధిక సి జి పి ఎ సాధించినందుకు గుర్తింపుగా విశ్రమ్జీ జామ్దార్ స్మారకార్థం కొత్తగా ఏర్పాటు చేసిన పతకాన్ని కూడా చేతనా శ్రీవాత్సవ సాధించారు
కార్యక్రమం చివర్లో సంస్థ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ ఆర్ సాథే వందన సమర్పణ చేశారు
) చైర్మన్ సంస్థ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ పి ఎం పడోలే సంస్థ తరఫున నివేదికను సమర్పించారు
55కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకున్నామని గత ఏడాదికంటే ఇది185శాతం ఎక్కువని ఆయన చెప్పారు
ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ రాజయ్య విజయవాడ పాలక వర్గ సభ్యులు శ్రీ చుక్కపల్లి ప్రసాద్ శ్రీ కోనేరు సత్యనారాయణ శ్రీ గ్రంధి విశ్వనాథ్ తో పాటు ట్రస్ట్ సీఈవో శ్రీ శరత్ బాబు విజయవాడ డైరెక్టర్ శ్రీ పరదేశి విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు
అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతి చేయడంపై ఉన్న నిషేధాన్ని జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి (01012021) కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది
డీఎఫ్‌సీలో చివ‌రి మైలు అనుసంధాన‌త ఉండేలా నిర్ధారించుకోవాలిః శ్రీ పియూష్ గోయల్
రాబోయే డీఎఫ్‌సీ పురోగ‌తిని స‌మీక్షించిన కేంద్ర రైల్వే వాణిజ్యం పరిశ్రమల‌ వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖల‌ మంత్రి శ్రీ పియూష్ గోయల్
దేశంలో డీఎఫ్‌సీ సమస్యల ప‌రిష్కార పురోగతిని వేగవంతం చేస్తున్నందున డీఎఫ్‌సీలు చివ‌రి మైలు అనుసంధాన‌తను క‌లిగి ఉండ‌డం నిర్ధారించుకోనేలా స‌న్నద్ధం కావాల‌ని కేంద్ర రైల్వేలు వాణిజ్యం పరిశ్రమలు వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఇక్క‌డ సూచించారు
రాబోయే డీఎఎఫ్‌సీల యొక్క‌ పురోగతి సమీక్షిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ సూచ‌న చేశారు
రోజువారీ సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు ప్రాజెక్ట్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ప్రాజెక్ట్‌కు రైల్వే శాఖ ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో పూర్తిగా అంకితమైన నిర్వహణ బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు
ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్‌సీ) లోని 351 కిలోమీటర్ల పొడవైన న్యూ భావ్‌పూర్ న్యూ ఖుర్జా విభాగంను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ రేపు ప్రారంభించనున్న‌ విష‌యం ఇక్క‌డ‌ గ‌మ‌నార్హ‌మ‌ని మంత్రి అన్నారు
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెస్ట్రన్ డీఎఫ్‌సీ (1504 రూట్ కి మీ ) మరియు తూర్పు డీఎఫ్‌సీ (సోన్నగర్డంకుని పీపీపీ విభాగంతో సహా 1856రూట్ కి
మంచి ప్రతిరూప పద్ధతులపై 7 వ ఎన్ హెచ్ ఎమ్ జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన డాక్టర్ హర్ష్ వర్ధన్
ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఆవిష్కరణ అనేది ఒక ముఖ్యమైన సహాయకారి
‌ఎం ఐ ఎస్) ను  కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించడం సాధారణ నిఘాపై కార్యాచరణ మార్గదర్శకాలు2020 ని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రారంభించారు
ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలో వివిధ ఉత్తమ పద్ధతులు ఆవిష్కరణలను గుర్తించడం ప్రదర్శించడం నమోదు చేయడం కోసం మొట్ట మొదటి సదస్సు 2013 లో శ్రీనగర్‌లో నిర్వహించగా చివరి సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది
ఈ కార్యక్రమం పట్ల డాక్టర్ హర్ష వర్ధన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మహమ్మారి పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు
ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నూతన శిఖరాలకు తీసుకువెళ్ళే వినూత్న కేంద్రీకృత వ్యూహాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం
2020 సంవత్సరంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల పోర్టల్ ‌లో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 210 కొత్త కార్యక్రమాలను అప్‌లోడ్ చేశాయి
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పోలియో నిర్మూలన ప్రచారానికి నాయకత్వం వహించిన తన అనుభవాలను డాక్టర్ హర్ష వర్ధన్ పంచుకున్నారు
మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆలోచనలు  ఆవిష్కరణల పాత్ర గురించి డాక్టర్ వర్ధన్ నొక్కి చెబుతూ  ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఆవిష్కరణ అనేది  చాలా ముఖ్యమైన సహాకారి
కోవిడ్19 కోసం చేపట్టిన చర్యలు వివిధ కార్యక్రమాలతో వ్యవహరించే కొత్త మార్గాలను ప్రారంభించడానికి ఆవిష్కరణలను రూపొందించడానికీ ప్రోత్సహించాయి పి పి ఈ కిట్లు వెంటిలేటర్లు మాస్కులు వ్యాక్సిన్లు మొదలైన వాటి తయారీ రంగంలో ఈ మహమ్మారి మనకు స్వావలంబన కలిగించింది
ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఈసంజీవని డిజిటల్ ప్లాట్ ‌ఫామ్ ‌లో ఒక మిలియన్లకు పైగా టెలికన్సల్టేషన్లు జరిగాయి
ఇది సమన్వయ ప్రయత్నాల ద్వారా ఉద్భవించిన వినూత్న విధానం యొక్క ఫలితం
ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో డిజిటల్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ హర్ష వర్ధన్ పునరుద్ఘాటిస్తూ సమర్థవంతమైన ప్రాప్యత కలుపుకొని సరసమైన సమయానుసారంగా మరియు సురక్షితమైన పద్ధతిలో సార్వజనిక ఆరోగ్య సదుపాయాల అందుబాటుకు మద్దతు ఇచ్చే జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి డిజిటల్ పరివర్తన మనకు సహాయపడింది
నూతన ఆరోగ్య సంరక్షణ సమాచార వ్యవస్థ (హెచ్ ‌ఎం ఐ ఎస్) విస్తృతమైన డేటాతో పాటు సమాచారం మౌలిక సదుపాయాల సేవలను అందించడం ద్వారా ఎటువంటి అవరోధాలు లేని ఆన్‌లైన్ ప్లాట్ ‌ఫామ్‌ను అందిస్తుంది
మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో మెరుగైన నిర్ణయ మద్దతు వ్యవస్థతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంరక్షణ సంస్కరణల్లో మెరుగుదలని సులభతరం చేయడానికి సరైన సమాచార మార్పిడి సహాయపడింది
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల ఈసంజీవని డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం ఓపెన్ డేటా ఛాంపియన్ కేటగిరీ కింద చాలా ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా అవార్డు2020 ను గెలుచుకుంది
తప్పిపోయిన కేసుల సంఖ్య 2019 లో 29 లక్షలకు తగ్గింది కాగా 2017 లో నమోదైన ఈ కేసుల సంఖ్య  10 లక్షలకు పైగా ఉంది ఎస్ డి జి లక్ష్యమైన 2030 కంటే ఐదేళ్ల ముందుగా అంటే  2025 నాటికే టి
బి రహిత భారతదేశాన్ని సాధించాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ఒక ధైర్యంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించారు
చివరగా డాక్టర్ హర్ష వర్ధన్ తమ ప్రసంగాన్ని ముగిస్తూ  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ సంప్రదింపులు నిర్వహించే ఈ మంచి అభ్యాసంతో పాటు  దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి కొత్త వినూత్న విధానాలను అనుసరించే సంస్కృతిని ప్రోత్సహించడం  ఈ సందర్భంలో అభ్యాసాలను పరస్పరం సుసంపన్నమైన అనుభవాలను పంచుకోవడం  కొనసాగిస్తుందని నేను ఆశిస్తున్నాను
ఆర్ డాక్టర్ రోడ్రికో ఆఫ్రిన్ కూడా హాజరయ్యారు
జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి బ్యాక్ టు బ్యాక్ లోన్‌గా రాష్ట్రాలకు 9 వ వాయిదాగా రూ
జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి 9 వ వారపు విడత రూ
మిగిలిన 5 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరం నాగాలాండ్ మరియు సిక్కింలకు జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేదు
10 లక్షల కోట్ల కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది
ఇప్పటివరకు తీసుకున్న మొత్తాన్ని 2020 అక్టోబర్ 23 2020 2 నవంబర్ 2020 9 నవంబర్ 2020 23 నవంబర్ 2020 1 డిసెంబర్ 2020 7 డిసెంబర్ 2020 14 డిసెంబర్ 2020 21 డిసెంబర్ 2020  28 వ డిసెంబర్ 2020 న రాష్ట్రాలకు విడుదల చేశారు
ఈ వారం విడుదల చేసిన మొత్తం రాష్ట్రాలకు అందించిన అటువంటి నిధులు ఇవి 9 వ విడత
ఈ మొత్తాన్ని 51508 వడ్డీ రేటుతో ఈ వారం రుణంగా తీసుకున్నారు
ఇప్పటివరకు ప్రభుత్వం 47488 వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ
జీఎస్టీ అమలు కారణంగా ఆదాయ కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు ఎంపికను ఎంచుకునే రాష్ట్రాలకు స్థూల రాష్ట్రాల దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 050 కు సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆప్షన్1 రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది
28 రాష్ట్రాలకు అదనపు రుణాలు తీసుకునే అనుమతి మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధుల మొత్తం మరియు ఇప్పటివరకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేయబడింది
అనుమతించబడిన జిఎస్‌డిపిలో 050 శాతం అదనపు రుణాలు తీసుకోవడం మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధులు 28122020 వరకు రాష్ట్రాలు / యుటిలకు చేరాయి
ఆవిష్కరించిన కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్
న్యుమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించే శక్తితో భారతదేశపు మొదటి న్యూమోకాక్కల్ సంయోజక వ్యాక్సీన్ (పి వి సి )ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్ర డాక్టర్ హర్షవర్ధన్ 2020 డిసెంబరు 28న ఆవిష్కరించారు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నాని ఇతర సీనియర్ అధికారులు వ్యాక్సీన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్ ఐ ఐ పి ఎల్ వ్యవస్థాపకుడు పూనావాలా పరిశ్రమల గ్రూపు చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా సీరమ్ ఇన్
16500 లోపు రోజువారీ కేసులతో భారత్
వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారతదేశం కోవిడ్ మహమ్మారి మీద పోరులో కీలకమైన అనేక మైలురాళ్ళను దాటుతూ ఉంది
రోజువారీ కొత్త కేసులు ఈ రోజు చెప్పుకోదగినంత తక్కువ స్థాయికి చేరి  16500 లోపు నమోదయ్యాయి
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 16432 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు
2020 జూన్ 25న రోజువారీ కేసులు  16922 నమోదు కాగా ఇప్పుడు ఆ స్థాయికి చేరటం మళ్లీ ఇప్పుడే
మొత్తం ఇప్పటిదాకా నమోదైన  పాజిటివ్ కేసులలో చికిత్స పొందుతూ ఉన్నవారి వాటా మరింత తగ్గి 263 కు చేరింది
ఇది గత 24 గంటలలో  8720 కేసుల నికర తగ్గుదలకు దారితీసింది
దీంతో కోలుకున్నవారి శాతం 9592 కు చేరింది
గడిచిన 24 గంటలలో 24900 మంది కోలుకున్నారు
వారిలో 7766 మంది పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్రీకృతమయ్యారు
మహారాష్ట్రలో అత్యధికంగా  4501 మంది కోలుకోగా ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 4172 మంది చత్తీస్ గఢ్ లో 1901 మంది కోలుకున్నారు
కొత్తగా పాజిటివ్ గా తేలినవారిలో 7816 మంది పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నారు
కేరళలో నిన్న అత్యధికంగా 3047 కేసులు రాగా మహారాష్ట్రలో 2498  చత్తీస్ గఢ్ లో 1188 కొత్త కేసులు నమోదయ్యాయి
గత 24 గంటలలో 252 మంది చనిపోగా వారిలో 7738 మంది పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే
ఈ వ్యూహం లో ఈ కింద పేర్కొన్న చ‌ర్య‌లు ఒక భాగంగా ఉన్నాయి అయితే ఈ చ‌ర్య‌ల‌కే ఈ వ్యూహం ప‌రిమితం కాబోదు
ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్‌లో డ్రైవర్ రహిత రైలు ప్రయాణ సేవల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగపాఠం
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ హర్దీప్ సింగ్ పురీజీ ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జీ డీఎంఆర్సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మంగూసింగ్ జీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మెట్రో సేవల ఉన్నతాధికారులు నా ప్రియ సోదర సోదరీమణులారా
దాదాపు మూడేళ్ల క్రితం మెజెంటా లైన్ ను ప్రారంభించే అవకాశం నాకు కలిగింది
ఇవాళ మరోసారి ఇదే మార్గంలో దేశంలో తొలిసారిగా పూర్తి అటోమెటెడ్ మెట్రో మన భాషలో చెప్పాలంటే డ్రైవర్ లెస్ మెట్రోను ప్రారంభించే అవకాశం లభించింది
భారతదేశం స్మార్ట్ సేవలవైపు ఎంత వేగంగా ముందుకెళ్తోందనడానికి ఈ మార్పులే నిదర్శనం
ఇవాళ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ తో ఢిల్లీ మెట్రో అనుసంధానమైంది
గతేడాది అహ్మదాబాద్ నుంచి ఈ కార్డు ప్రారంభమైంది
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశాన్ని సిద్ధం చేసేందుకు ఇవాళే పనిచేయడం ఈ ప్రభుత్వ కీలక బాధ్యత
కానీ కొన్ని దశాబ్దాల క్రితం పట్టణీకరణ ప్రభావం పట్టణీకరణ భవిష్యత్తు స్పష్టంగా కనిపించేవి
పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నప్పటకీ దాని తదనంతర ప్రభావాలకు అనుగుణంగా మన  పట్టణాలను మాత్రం సిద్ధం చేయలేదు
దీని ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో పట్టణ మౌలికవసతుల డిమాండ్ వాటిని తీర్చడంలో స్పష్టమైన తేడా కనిపించింది
ఢిల్లీలోనే మెట్రోకు సంబంధించి ఏళ్లతరబడి చర్చ జరిగింది
కానీ తొలి మెట్రో మాత్రం అటల్ జీ కృషికారణంగానే పట్టాలెక్కింది
ఇవాళ్టి కార్యక్రమంలో మెట్రో నిపుణులు అందరికీ మెట్రో నిర్మాణంలో ఏ పరిస్థితి ఉండేదో చాలా బాగా తెలుసు
2014లో మా ప్రభుత్వం ఏర్పాటైనపుడు కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో ఉండేది
ఇవాళ 18 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి
2025 నాటికి కనీసం 25కు పైగా నగరాల్లో మెట్రో సేవలను విస్తరించబోతున్నాం
2014లో దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో అందుబాటులో ఉండేది
నేడు ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి 700 కిలోమీటర్లకు పైగా విస్తరించి సేవలందిస్తోంది
2025 నాటికి ఇది 1700 కిలోమీటర్లకు పెంచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి
2014లో మెట్రోలో ప్రయాణించేవారి  సంఖ్య రోజూ 17 లక్షలుగా ఉండేది ఇప్పుడు ఆ సంఖ్య ఐదురెట్లు పెరిగి 85 లక్షలకు చేరింది
ఇవి కేవలం లెక్కలు మాత్రమే కాదు కోట్లమంది భారతీయుల జీవనాలను సౌకర్యవంతం చేశామనడానికి రుజువులు
ఇది కేవలం ఇటుకలు రాళ్లు కాంక్రీట్ ఇనుముతో నిర్మించినది మాత్రమే కాదు దేశ ప్రజల మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను పూర్తిచేశామనడానికి సాక్ష్యం
చివరకు ఈ విషయంలో మార్పు ఎలా వచ్చింది
గతంలో మన దేశంలో మెట్రోకు సంబంధించిన ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉండేవి కావు
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆకాంక్షలు అవసరాలు ఆశలు సవాళ్లుంటాయని మీలో చాలా మందికి తెలుసు
అందుకే వేర్వేరు నగరాల్లో వేర్వేరు విధాలుగా మెట్రో రైలు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాం
రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్) ఢిల్లీమీరట్ ఆర్ఆర్‌టీఎస్ ఒక అద్భుతమైన మోడల్‌తో ఢిల్లీమీరట్ దూరాన్ని గంటకంటే తక్కువ సమయానికే తగ్గించింది
మెట్రో లైట్ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నచోట మెట్రో లైట్ వర్షన్ పై పనిజరుగుతోంది
ఇది సాధారణ మెట్రోకంటే 40శాతం తక్కువ ఖర్చుకే అందుబాటులోకి వస్తుంది
మెట్రో నియో మెట్రో లైట్ కంటే తక్కువ ప్రయాణికులు ఉన్నచోట మెట్రో నియో పై పనిజరుగుతోంది
దీని వల్ల నగరాల మధ్య అనుసంధానతతోపాటు వాటికి దగ్గర్లో ఉన్న ప్రజలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లబ్ధి చేకూరుతుంది
కొచ్చిలో ఈ పని చాలా వేగంగా జరుగుతోంది
ఈ రోజున నాలుగు పెద్ద కంపెనీలు మన దేశంలోనే మెట్రో కోచ్ ల తయారీ చేస్తున్నాయి
వీటి ద్వారా భారత్ లో తయారీ తో పాటు ఆత్మ నిర్భర భారత్ కు మద్దతు లభిస్తోంది
అత్యంత ఆధునిక పరిజ్ఞాన ఉపయోగం ఈ రోజున అవసరం
ఈనాడు మెట్రో లో 130 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉపయోగిస్తున్నారు
ఆధునీకరణ కోసం ఒకే విధమైన ప్రమాణాలు  సౌకర్యాలు అందించడం చాలా అవసరం